జీఎస్టీ లోకి పెట్రోల్ డిజీల్.. లీటర్ 40 మాత్రమే.. ఎప్పటి నుంచో తెలుసా

334

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. పెట్రోలియం ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, డీలర్ల కమీషన్ పేరిట వినియోగదారుల చేతి చమురు భారీగా వదులుతోంది. పెట్రోలియం ధరలు భారీగా పెరిగిన సందర్భాన్నే ఉదాహరణగా తీసుకుంటే దారుణంగా కస్టమర్లకు పన్నులు వాత చూపిస్తున్నాయి. ఇక వీటిని కూడా జీఎస్టీలోకి తీసుకురావాలి అని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే దీనిని జీఎస్టీలోకి తీసుకురావాలి అని కేంద్రం కూడా భావిస్తోంది, ఇలా చేస్తే రాష్ట్రాలు భారీగా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. దీనికి రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటాయా లేదా అనేది చూడాలి ధరలు తగ్గాలి అంటే వీటిని జీఎస్టీలోకి తీసుకురావాలి, ప్రజలు మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి అని కోరుతున్నారు.

Image result for petroleum

లీటర్ పెట్రోలు వాస్తవ ధర రూ. 30.70 ఉండగా.. సగటు వినియోగదారుడు అదనపు ఛార్జీల రూపంలో రూ. 39.68 చెల్లించాల్సి వచ్చింది. ఢిల్లీ చెల్లిస్తున్న బేస్ ధర కంటే ఇది 129.25 శాతం కావడం గమనార్హం. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల భారం ఉండదు. 28 శాతం జీఎస్టీ విధించినా.. పెట్రోల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. రూ. 39.30 లీటర్ పెట్రోల్ కొనుగోలు చేయొచ్చు. అంటే లీటర్కు రూ. 30 పైనే మనకు ఆదా అవుతుంది.

Image result for petroleum bunks

ఇలా చేస్తే కామన్ మ్యాన్ ఖుషీ. కానీ ప్రభుత్వాల ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఢిల్లీ ప్రభుత్వాన్నే తీసుకుంటే.. పెట్రోల్పై 27 శాతం వ్యాట్ విధిస్తోంది. అదీగాక ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తం నుంచి 42 శాతం వాటా మళ్లీ రాష్ట్రాల ఖాతాలోకే మళ్లుతోంది. అంటే.. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ అమ్మితే రూ. 23.98 కేజ్రీవాల్ ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. కానీ పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. జీఎస్టీ రూపంలో వాటికి దక్కేది 14 శాతమే. అంటే లీటర్ పెట్రోల్ మీద దక్కేది రూ. 4.29 మాత్రమే.

ఈ క్రింది వీడియో చూడండి

చూస్తూ చూస్తూ.. లీటర్ పెట్రోల్ మీద రూ. 19.69 వదులుకోవడం ఏ రాష్ట్రానికి మాత్రం ఇష్టం ఉంటుంది? అందుకే పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ పై జఎస్టీ కౌన్సిల్ గానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ నోరు మెదపడం లేదు. ఒకవేళ జీఎస్టీ పరిధిలోకి వచ్చినా.. ప్రభుత్వాల ఆదాయం భారీగా తగ్గకుండా అదనంగా సెస్లు విధించడానికి కౌన్సిల్ మొగ్గు చూపొచ్చు. ఏతావాతా చెప్పేదేంటంటే.. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తేవడమనేది కష్టంతో కూడుకున్నది. మళ్లీ వాటికి పైన పన్నులు అంటూ మనకు మిగిలేది కొంచెమే. ఇది పక్కనబెడితే దీపావళి నాటికి పెట్రోల్ ధరలు తగ్గుతాయని తెలుస్తోంది చూద్దాం ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకుంటుందో.