ఇంట్లో పనిమనిషితో భర్త రాసలీలలు…గుట్టురట్టు చేసిన రామచిలుక..ఎలానో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

462

ఆ ఇంటి యజమానికి రామచిలుకలంటే అమితమైన ఇష్టం. ఆ చిలుక పలుకులకు తెగ ముచ్చటపడిన ఓ వ్యక్తి.. చిలుకను పెంచుకున్నాడు. ఆ చిలుకను కన్నబిడ్డకంటే ప్రేమగా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చాడు.
ఆ ఇంటి యజమానికి రామచిలుకలంటే అమితమైన ఇష్టం. ఆ చిలుక పలుకులకు తెగ ముచ్చటపడిన ఓ వ్యక్తి.. చిలుకను పెంచుకున్నాడు. ఆ చిలుకను కన్నబిడ్డకంటే ప్రేమగా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుతూ వచ్చాడు. ఈ క్రమంలో యజమాని మాటలను గమనిస్తూ.. వాటిని తిరిగి వల్లెవేస్తూ వస్తోంది ఆ రామచిలుక. ఆ ముద్దుముద్దు పలుకులు విని అతగాడు తెగ సంబరపడిపోయాడు.

అయితే ఆ చిలుక పలుకులే.. యజమాని గుట్టురట్టు చేశాయి. ఇంట్లో పనిమనిషితో నడుపుతున్న అక్రమ సంబంధాన్ని బహిర్గతం చేసింది. పనిమనిషితో అతడు చేసిన సరస సంభాషణలు మొత్తం.. ఆ చిలుక భార్య ముందు తన పలుకుల రూపంలో పూసగుచ్చినట్టు వినిపించింది. దీంతో నివ్వెరపోయిన ఆమె.. భర్త మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు వరకు తీసుకెళ్లలేమని విచారణ అధికారులు చెబుతున్నారు. చిలుక అతడి మాటలనే తిరిగి చెబుతున్నట్లు నిరూపించలేమని, రేడియో, టీవీల్లో సంభాషణలను విని ఉండొచ్చన్న వాదన తెరపైకి వస్తుందని అంటున్నారు. ఇంతకీ ఈ సంఘటన కువైట్‌లో జరిగింది.