కుక్కను అలా చేసిందని ఈమె నోటితో ఏం చేసిందో తెలిస్తే షాక్.

463

కుక్కలు మనుషులను కరవడం సర్వ సాధారణం.మనం వాటితో ఆడుకుంటున్న సమయంలో వాటికీ నచ్చని పని మనం ఏదైనా చేస్తే అది వెంటనే మన మీద పడి కరిచేస్తుంది.అయితే మనిషిని మనిషి కరవడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అది కూడా కుక్కకంటే దారుణంగా. లేదు కదా..కానీ ఇప్పుడు అలంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది..కుక్క కంటే దారుణంగా ఒక లేడి మరొక లేడిని కొరికింది. అసలేమైంది. ఎందుకు కొరికింది. పూర్తీగా తెలుసుకుందాం.

Image result for dogs with girls

ఓక్లాండ్‌కు చెందిన ఓ మహిళ ఉదయం జాగింగ్ చేస్తుంది. తన పనిలో తాను ఉండగా ఓ కుక్క ఆమె వెంటబడింది. దీంతో కంగారుపడిపోయిన ఆ మహిళ కుక్కను తరమడానికి ప్రయత్నించింది. అయినా కానీ ఆ కుక్క వెంట పడింది. దాంతో తన వద్ద ఉన్న పెప్పర్ స్ప్రేను కుక్క కంట్లో కొట్టింది. ఇది గమనించిన కుక్క యజమాని అల్మా కడ్వాలడర్ (19) నా కుక్క కళ్లలో పెప్పర్ స్ప్రే కొడతావా అంటూ సదరు మహిళ చేయి పట్టుకుని కుక్క కంటే దారుణంగా కరిచేసింది. అక్కడితో ఆగలేదు…. ఆమె ముఖం మీద పిడి గుద్దులు గుద్దడంతో పాటు ఎగిరెగిరి ఆమెను తన్నింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. అయితే కుక్కను కొట్టిన మహిళ తీవ్రంగా గాయపడింది.ఇంకొకసారి మూగ జీవాలను హింసిస్తే సహించేది లేదని ఆ కుక్క యజమాని హెచ్చరించి పోయింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే సదరు మహిళ జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఈస్ట్‌బే రీజనల్ పార్క్ డిస్ట్రిక్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అల్మేదా కంట్రో జడ్జ్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమెను శాంటారీటా జైల్‌కు తరలించారు.తన వెంటబడిన కుక్కను ఛీ కొట్టిందనే కోపంతో దాని యజమాని ఆ మహిళతో కలబడి మరీ కరిచేసిన ఈ సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ విచిత్రమైన వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. మరి ఈ ఘటన గురించి మీరేమంటారు. కుక్క కళ్ళలో స్ప్రే కొట్టడం గురించి అలాగే దానిని సహించలేక ఆ మహిళను కొట్టాడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.