కేరళ ప్రజలకు మరో షాక్.. నీళ్ళల్లో భయంకరమైన పాములు చూస్తే షాక్!

457

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి..ఇప్పటికి కూడా అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో సహాయ కార్యక్రమాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

Related image

 

రోజురోజుకు నీటి మట్టం పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.అయితే ఇలాంటి సమయంలో కూడా అక్కడి ప్రజలు పాములకు భయపడుతున్నారు. మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా. కేరళ ప్రజల పరిస్థితి దారుణంగా అవుతుంది.ఒకవైపు వరద నీరు మరొకవైపు చలి వారిని తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుంది.ఇప్పటికే చాలామంది హాస్పిటల్ పాలు అవుతున్నారు.సహాయక చర్యలు చేపట్టేవాళ్ళు ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించి వారిని రక్షిస్తున్నారు.ఇది ఇలా ఉంటె అక్కడి ప్రజలను భయపెట్టడానికి పాములు కూడా రెడీ అయ్యాయి.వరదలలో పెద్ద పెద్ద పాములు కొట్టుకొస్తున్నాయి.ఆ వరద నీరు ధాటికి అవి కూడా ఎక్కడ ప్లేస్ ఉంటె అక్కడ వచ్చి దరికి చేరుతున్నాయి.సహాయక కేంద్రాల దగ్గరకు వచ్చి చేరుతున్నాయి.

Image result for kerala flood in snakes

ఒకవైపు వరదలకు మరొక వైపు వరదలలో కొట్టుకొస్తున్న పాములకు జనాలు భయందోళనకు గురవుతున్నారు. పాము కాటుకు చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారు. పొన్నాంబలమేడులో ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.వరద నీళ్ళలో పాములు కొట్టుకొస్తున్నాయి. అప్పచిమేడులో 26 మంది పాము కాటుకు గురయ్యారు.వీరికి సహాయక కేంద్రాల వద్ద చికిత్స అందిస్తున్నారు.పాము ఎప్పుడొచ్చి కాటు వేస్తుందా అని భయపడుతున్నారు.అక్కడి జనాలు విష బారిన పడకుండా అవగాహనా కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ చెప్పాడు.

అంటూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పాడు.ఒకవైపు వరద నీరే భయపెడుతుంది అంటే ఇప్పుడు ఈ పాముల ఇంకా భయపెడుతున్నాయని ప్రజలు అంటున్నారు. తక్షనమే ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. చూడాలి మరి వీరి కష్టాలు ఎప్పుడు తీరుతాయో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ వరదల గురించి అలాగే అక్కడి ప్రజలను భయపెడుతున్న పాము సంఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.