స్వదేశానికి తిరిగొచ్చిన అభినందన్ పై పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేసాడో వింటే షాక్

325

అభినందన్.. ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న పేరింది. భారత్‌లో దాడికి ఎంటరైన పాకిస్థాన్ యుద్ధ విమాన్ని తరుముతూ వెళ్లి కూల్చేయడం.. ఆ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న మిగ్-21 కూలడం, ఆయన పాక్ సైన్యానికి చిక్కడం తెలిసిందే. పాక్ ఆర్మీకి చిక్కే ముందు ఆయన తన దగ్గరున్న కీలక డాక్యుమెంట్లను నాశనం చేశారు. పాక్ సైన్యం చెరలోనూ ఆయనెంతో ధైర్యంగా మాట్లాడి.. భారత సైన్యం ఎంత దృఢమైందో ప్రపంచానికి చాటారు. అంతర్జాతీయ ఒత్తిడి, యుద్ధ భయంతో పాక్ అభినందన్‌ను వెనక్కి పంపించింది.. ఆయన స్వదేశం రావడంతో ప్రతి భారతీయుడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఇస్లామాబాద్ నుంచి అభినందన్‌ను వాయు మార్గం ద్వారా లాహోర్ తరలించిన పాక్ అధికారులు.. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అట్టారీ వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ కొన్ని లాంఛనాల అనంతరం ఆయణ్ని భారత అధికారులకు అప్పగించారు..

వాఘా సరిహద్దు వద్ద ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన బృందం.. అభినందన్‌ను రిసీవ్ చేసుకుంది.. అనంతరం అక్కడే సిద్ధంగా ఉంచిన వైద్య బృందంతో ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.. ఇండియన్ హీరోను అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి తరలించారు. అయితే అభినందన్ తిరిగి రావడంతో భారతీయులు పండుగ చేసుకుంటున్నారు. దేశం మొత్తం ఆయనకు సెల్యూట్ చేస్తుంది. ఇతని మీద పెద్ద పెద్ద రాజకీయనాయకులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభినందన్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కర్నూల్ జిల్లాలో యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ అభినందన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైలెట్ అభినందన్ ఇండియాకు తిరిగొచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అభినందన్ లో ఉన్న గుండెధైర్యం అందరిలో ఉండాలి. అభినందన్ వీడియో చూస్తుంటే ప్రాణాలు పోయినా కానీ శత్రుసైన్యానికి తలదించలేదు. కావాలంటే ప్రాణాలు తీసుకోండి కానీ నేను నా దేశం విషయాలు చెప్పను అని అతను చూపిన తెగువకు అందరం అభినందించాలి. అలంటి వీరులు ఇంటికి ఒకడు ఉండాలి.

మనకు అన్యాయం చేసేవాళ్లు మీద అలంటి తెగువ చూపే దైర్యం అందరిలో ఉండాలి. నేను అభినందన్ కు సెల్యూట్ చేస్తున్నా.అతని దేశభక్తికి ఇదే నా సెల్యూట్. దేశం కోసం ప్రాణాలు ఇద్దాం.యుద్ధం వస్తే అందరం కలిసి ముందుకెళదాం అని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అన్నాడు. మరి అభినందన్ మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.