Breaking News:పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ఆక్సిడెంట్…షాక్ లో జన సైనికులు

313

దేశంలో ఎలక్షన్స్ హడావిడి మొదలయ్యింది.ఇంకొక నెల తర్వాత ఎలక్షన్స్ జరగనున్నాయి.అయితే ప్రచారంలో అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి.ఇప్పటికే చాలా పార్టీలు తమ టికెట్స్ ఇచ్చేశాయి.అందుకే గెలుపు కోసం అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి.అయితే పార్టీలో ఉండే పెద్ద పెద్ద లీడర్స్ ను తీసుకుని ప్రచారం మొదలుపెడుతున్నారు.తెలంగాణాలో ఇప్పటికే ప్రచారం మొదలయ్యింది.వచ్చే ఏడాది ఏపీలో జరగనున్నాయి.ఆ ఎన్నికలలో గెలవడానికి అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచి ప్రచారాలు చేస్తున్నాడు.యాత్రలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నాడు.అయితే ఇలా యాత్ర చేస్తున్న సమయంలో అతని కాన్వాయ్ కు యాక్సిడెంట్ అయ్యింది.మరి ఆ ప్రమాద ఘటన గురించి తెలుసుకుందామా.

జనసేన అధినేత పవన్ కళ్యాన్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారుకు అతి సమీపంలో జరిగింది. అయితే ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి హాని జరగలేదు. ఆయన సురక్షితంగా బైటపడ్డారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు కాకినాడ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టిన కారులో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు సెక్యూరిటీ సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.

గాయపడిన వారిలో శివ, నవీన్‌, పి. అరవింద్‌, కె.శ్రీకాంత్‌, జె.రామకిశోర్‌, జావీద్‌, బాబి, బి. శ్రీకాంత్‌ ఉన్నారు. అందరికీ చిన్నచిన్న గాయలే అయ్యాయని ఎవరికీ ప్రాణాపాయం లేదని సమాచారం. వారి ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ తో పాటు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.మరోవైపు పవన్ కాన్వాయ్ కు యాక్సిడెంట్ ఘటనపై జనసేన వెంటనే స్పందించింది. ఘటనపై తక్షణం విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలని జనసేన డిమాండ్ చేసింది. లేని పక్షంలో దీన్ని ప్రభుత్వ కుట్రగా భావిస్తామని జనసేన న్యాయవిభాగం ఒక ప్రకటనలో పేర్కొన్నది.