ప్రణయ్ హత్య పై పవన్ కళ్యాణ్ ఎలా ఫైర్ అయ్యాడో చూడండి

403

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని అల్లుడిని అతి కిరాతకంగా చంపించిన మిర్యాలగూడ ఘటన గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటుంది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకుందని అల్లుడంటే ఇష్టం లేని మారుతీరావు కిరాయి గుండా చేత చంపించాడు.నిన్న ప్రణయ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.మారుతీరావు ను అరెస్ట్ చేశారు.చంపినా వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే ఈ ఘటన మీద పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.ఈ విషయం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు.మరి ఆయన ఏమన్నాడో చూద్దామా.

Image result for pranay and amrutha

పరువు హత్య ఘటనలో చనిపోయిన ప్రణయ్ అంత్యక్రియలకు పలువురు ప్రముఖులు వచ్చి తమ సంతాపాన్ని తెలియజేశారు.గోరెటి వెంకన్న,మందకృష్ణ మాదిగ,లాంటి ప్రముఖులు వచ్చి తమ సంతాపాన్ని తెలియజేశారు.కులం తక్కువ అని చంపేస్తారా అని నిలదీశారు.సమాజంలో కుల వ్యవస్థ ఎలా ఉందొ చెప్పడానికి ఇదొక నిదర్శనం అని మందకృష్ణ మాదిగ అన్నాడు.అయితే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు.ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ..కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని అల్లుడిని చంపిన మిర్యాలగూడ ఘటన మరీ దారుణం.దేశంలో కులం అనేది ఇంకా ఈ స్థాయిలో ఉందని చెప్పడానికి మనమందరం సిగ్గుపడాలి.కులం అనే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలి.లేకుంటే ఇలాంటి అమానుష ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయి.

Image result for pawan kalyan

పాలకులు చొరవ తీసుకుని ఈ విషయం మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు మళ్ళి పునరావృతం కాకుండా ఉంటాయి.మనది ఒకటే కులం మానవతా కులం.ఒకటే మతం మానవతా మతం.అన్ని కులాలు ఒకటే అన్ని మతాలు ఒకటే.కులం పేరు ఎత్తితే నాకు అరికాలి నుంచి పై వరకు కోపం వస్తుంది.దేశంలో కులం మతం పేరు ఎత్తని రోజు రావాలని కోరుకుందాం.కుల వ్యవస్థ మాత వ్యవస్థ అనేది రూపుమాపాలి.జనసేన దాని కోసం పోరాడుతుందని పవన్ కళ్యాణ్ అన్నాడు.అలాగే భర్తను కోల్పోయిన ఆ అమృతకు ప్రభుత్వం అండగా ఉండాలి.ఆమెకు ఎవరు లేరనే భాదను మనమందరం తీర్చాలి.ఆమెకు ఏ కష్టం రాకుండా మనం చూసుకోవాలి.అది మన అందరి భాద్యత.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆడపిల్ల కష్టపడితే మనం చూస్తూ ఉండకూడదు.ఆమెకు ఆమెకు పుట్టబోయే బిడ్డకు మనమందరం ఉన్నామనే ధైర్యాన్ని ఆమెకు కలగజేయాలి.అలాగే ఈ కేసులో నిందితులుగా తేలిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి అని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నాడు.విన్నారుగా మిర్యాలగూడ ఘటన మీద పవన్ కళ్యాణ్ ఏమని స్పందించాడో.మరీ ఈ విషయం గురించి మీరేమంటారు.మిర్యాలగూడ పరువు హత్య గురించి దాని వెనుక ఉన్న కులం అనే విషయం గురించి అలాగే పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి మాట్లాడుతూ అన్న మాటల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.