బైక్ పై నుండి పడిపోయిన తల్లిదండ్రులు ఈ చిన్నారి ఎలా సేవ్ అయిందో చూస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు

446

ఏదైనా రాసిపెట్టి ఉంటే ఎవ‌రు వ‌చ్చినా, అందిన కాడికి దోచుకుందామ‌న్నా వారికి ద‌క్క‌దు. రాసిపెట్టిన వారికి మాత్ర‌మే ద‌క్కుతుంది. అలాగే ప్ర‌మాదం కూడా ఎవ‌రూ ఆప‌లేరు. ఎవ‌రు వ‌చ్చి ఆపినా జ‌ర‌గాల్సిన ఘోరం మాత్రం జ‌రిగిపోతుంది. అదృష్టం ఉంటే అద్భుతం జరుగుతుందని అంటారు. బెంగళూరులో సరిగ్గా ఇదే జరిగింది. తన చిన్నారి పిల్లవాడిని తీసుకుని ఓ జంట బెంగళూరులో బయటకు వచ్చారు. పిల్లాడిని ముందు కూర్చొబెట్టుకుని తండ్రి వేగంగా బైక్ నడిపాడు. ఎప్పటిలాగే తండ్రి ఫాస్ట్‌గా డ్రైవింగ్ చేస్తుంటే.. పిల్లాడు బాగా ఎంజాయ్ చేశాడు. తండ్రి కూడా అదే వేగంతో ముందుకు బైక్ నడిపాడు. అతి వేగం అన‌ర్దానికి మూలం అంటారు. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. చివ‌ర‌కు ఎంత దారుణం జ‌రిగిందో చూసి చ‌లించిపోయారు. అదృష్ట‌వంతులు అని ఆనంద‌ప‌డ్డారు ఓసారి ఈ స్టోరీ తెలుసుకుందాం.

బెంగళూరు హైవే పై వెళ్తున్న దంపతులు బైక్ పై స్పీడ్ గా వెళ్తూ ఎదురుగా ఉన్న స్కూటీని బలంగా ఢీకొన్నారు.దాంతో స్కూటిపై ఉన్న వ్యక్తితోపాటు బైక్ మీది నుంచి దంపతులిద్దరూ కింద పడిపోయారు. కానీ ముందు భాగంలో హ్యాండిల్ పట్టుకొని కూర్చున్న పాప అమూల్య మాత్రం అలాగే బైక్‌తోపాటు వెళ్లిపోయింది. ఘోర రోడ్డు ప్రమాదం బారినుండి ఈ చిన్నారి సురక్షితంగా బయటపడిన వైనం చూస్తే అధ్బుతం అనుకోకుండా ఉండలేం.

చన్నపరమేశ్వర్, రేణుక దంపతులు తమ ఐదేళ్ల చిన్నారితో కలసి బేగూరు నుంచి బెంగుళూరుకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ముందు వెళ్తున్న బైక్ ను చిన్నారి తండ్రి వేగంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులిద్దరూ బైక్ పై నుంచి కిందకు పడిపోయారు. కానీ, వారి బైక్ మాత్రం కిందపడలేదు. ముందు కూర్చున్న చిన్నారితో పాటు దాదాపు 300 మీటర్ల దూరం ప్రయాణించింది. ఆ తర్వాత వేగం తగ్గిన బైక్, రోడ్డుకు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొంది. దీంతో, ఆ చిన్నారి పక్కన ఉన్న గడ్డిలో పడి, సురక్షితంగా బయట పడింది. ఈ మొత్తం ఘటన వెనుకనే వస్తున్న ఓ కారు కెమెరాలో రికార్డ్ అయింది. బెంగుళూరు రూరల్ లోని నేలమంగళ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దంపతులిద్దరికీ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి.

వెనక వస్తున్న కార్ డ్యాష్ బోర్డులో రికార్డు అయిన వీడియోను ఓ పోలీసు ట్విట్టర్ లో షేర్ చేశారు. వైరలైన వీడియోను చూస్తున్న నెటిజన్లు ప్రమాదం నుండి బయటపడిన పాపను చూసి ఆశ్చర్యపోతున్నారు..బెంగళూరులో,సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ టాపిక్ గా మారింది ఈ వీడియో.. అతివేగం ఎన్ని అన‌ర్దాల‌కు దారితీస్తుందో చూడండి అంటూ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డార‌ని, పాప కూడా అంత వేగంతో వెళ్తున్న బైక్ పై నుంచి డివైడ‌ర్ ని ఢీకొని ఉండిపోయింది అని. లేక‌పోతే పెను ప్ర‌మాదం జ‌ర‌గేది అని చెబుతున్నారు. హైవేల‌లో ఇష్టం వ‌చ్చినట్లు ర్యాష్ డ్రైవింగ్ చేయ‌కూడ‌దు, అలాగే మితిమిరిన వేగం కూడా మంచిది కాదు అని చెబుతున్నారు.