కంబైన్డ్ స్టడీస్ పేరుతో మేడ మీద వీళ్ళు చేస్తున్న పనులు చూసి షాక్ అయిన తల్లిదండ్రులు..ప్రతి యువతీయువకులు తప్పకచూడండి

307

ప్రేమ అనేది గొప్పది. ప్రేమలో ఉన్న మజా పొందాలంటే ప్రేమిస్తేనే తెలుస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి కానీ ప్రేమలో ఉన్నప్పుడు మనం చేసే చిన్న తప్పుకు మన ప్రేమ మనకు దూరం అయితే ఎలా ఉంటుందో అది ప్రేమలో విఫలం అయినా వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. అలా చేసిన తప్పుకు ప్రేమలో విఫలం అయినా ఒక ప్రేమికుడు తన విఫల ప్రేమగాథను చెప్తున్నాడు. మరి విందామా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నా పేరు రాజేష్. నేను ప్రేమించిన అమ్మాయి పేరు రాణి. నేను డిగ్రీ కంప్లీట్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. తను మేము ఉండే ఇంటిలోనే పై ఫ్లోర్ లో అద్దెకు ఉండేది. తను పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేది. నేను కూడా కొన్ని పరీక్షలకు ప్రిపేరయ్యేవాణ్ని. దీంతో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తను ఒక్కతే రూమ్ లో ఉండడం వల్ల తరుచుగా మా ఇంటికి వచ్చేది.మా ఇంట్లోవాళ్లు కూడా తనని బాగా ఇష్టపడేవాళ్లు. మా అమ్మ వంట చేయడంలో తను సాయం చేసింది. కొత్తవాళ్లు ఎవరైనా ఇంటికి వస్తే తను కూడా మా ఇంట్లోని అమ్మాయే అనుకునేవారు. తను చదువులో ఫస్ట్. మా నాన్న ఎప్పుడూ తనని చూసి నేర్చుకోరా అంటూ నన్ను తిట్టేవాడు.రానురాను ఆ అమ్మాయితో నాకు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా అని డౌట్. అయినా ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. రెండు రోజులు మౌనంగా ఉంది. నా గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. మూడో రోజు మౌనం వీడి మాట్లాడింది. నాకు నువ్వుంటే చాలా ఇష్టం కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిస్తే మీ ఇంట్లో వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని భయం వేస్తుంది.ఈ అమ్మాయి చివరకు మా వాణ్నే బుట్టలో వేసుకుందా అని మీ వాళ్లు తప్పుగా అనుకుంటారని నాకు భయంగా ఉందంది. అందుకే నువ్వంటే నాకిష్టం ఉన్న కూడా నేను నా మనస్సులోని మాటను చెప్పలేకపోతున్నాని అంది.

Related image

మా అమ్మనాన్న అస్సలు అలా అనుకోరు. వాళ్లకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాను.వాళ్లను ఒప్పించే బాధ్యత నాది. నీకు ఇష్టం ఉంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాను. సరే నాకు నువ్వుంటే చాలా ఇష్టం అంది. వెంటనే తనను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాను. కౌగిలించుకున్నాను. అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అంది. సరే అన్నాను.ఇక ఆ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీలో నాగచైతన్య, తమన్నాల మాదిరిగా రొమాన్స్ చేసుకుంటే కంబైన్డ్ స్డడీస్ చేసేవాళ్లం. మా ఇంట్లో వాళ్లు మేమిద్దరం కలిసి బుద్దిగా చదువుకుంటున్నామనుకునేవారు. కానీ బెడ్రూమ్ లో మేమిద్దరం చాలా చిలిపి పనులు చేసేవాళ్లం.ఇంతలో ఒక రోజు తనను చూసేందుకు ఆ అమ్మాయి నాన్న వచ్చాడు. అప్పుడు కూడా తను మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో మనిషిలా తను కలిసిపోయినందుకు, మేము తనని బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషపడ్డాడు.

Related image

అయితే మాకు తెలీకుండా ఒకసారి వాళ్ళ నాన్న పైకి వచ్చాడు. అంతే ఆ సమయంలో మేము మంచి భంగిమలో ఉండి ముద్దు పెట్టుకుంటున్నాం. అది చూసి వాళ్ళ నాన్న కోపంతో రగిలిపోయాడు.నాకు చివాట్లు పెట్టి తనను ఇంటికి తీసుకెళ్లాడు.ఆ తర్వాత మా ఇద్దరికీ కలవకుండా తల్లిదండ్రులు అడ్డు పడ్డారు. ముఖ్యంగా ఆ అమ్మాయి తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడ కాపలా ఉన్నాడు.వాళ్ళ తల్లిదండ్రులకు తాను ఒక్కతే అమ్మాయి కాబట్టి తల్లిదండ్రులు మాటలను కాదనలేకపోయింది. అలా మా ప్రేమ ముగిసిపోయింది. తాను నాకు దూరం అయినా తన ప్రేమ నాకు దూరం కాలేదు. ఎప్పటికైనా తిరిగొస్తాదని అనుకుంటూ జీవిస్తున్నా అని ఆ అబ్బాయి తన విఫల ప్రేమగాథను చెప్పుకున్నాడు.మరి ఈ ప్రేమికుడు చెప్పిన ఈ విఫల ప్రేమగాథ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.