గర్భం నుంచి తలను తీశారు..కానీ మొండెంను వదిలేసి ఏం చేసారో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

530

డాక్టర్ వృత్తి అనేది ఎంత పవిత్రమైనది.ఈ భూమి మీద ప్రతి ఒక్కరు చేతులేత్తి దండం పెట్టేది ఒక్క డాక్టర్ కే.ఎందుకంటే ప్రతి ఒక్కరి ప్రాణాలను రక్షించేది వాళ్ళే.వాళ్ళు తలచుకుంటే చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని కూడా రక్షిస్తాడు.అయితే ఈ మద్య డాక్టర్స్ కూడా తప్పులు చేసి పేషెంట్స్ జీవితాలను బలిచేస్తున్నారు.ఈ మద్య డాక్టర్స్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలియజేసే ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.ఇప్పుడు మరొక ఘటన బయటపడింది. ఆపరేషన్ల సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. నిండు గర్భణికి కాన్పు చేసిన వైద్యులు శిశువు తలను మాత్రం వెలికి తీసి మొండెంను మాత్రం గర్భంలోనే వదిలేశారు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

పాకిస్తాన్ క్వెట్టాలో ఘోరం జరిగింది. ఓ మహిళా డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తల్లి గర్భం నుంచి బయటకు వస్తున్న బిడ్డ బయటకు రాకముందే ప్రాణాలు కోల్పోయాడు. వింటనే ఒళ్లు జలదరించే ఘటన ఇది. శిశువును బయటకు తీసే క్రమంలో తలను మాత్రం తీసి, మొండెను తల్లి గర్భంలోనే వదిలాడు.ఈ సంఘటన క్వెట్టాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బిడ్డ మొండాన్ని తల్లి కడుపులోనే ఉంచడమే కాకుండా తదుపరి శస్త్ర చికిత్స కోసం సివిక్ ఆసుపత్రికి వెళ్లాలని సదరు ప్రయివేటు ఆసుపత్రి వైద్యులు వారికి తెలిపారు.దీంతో ఆ తల్లిని సివిక్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జికల్ ఆపరేషన్ చేసి తల్లి గర్భంలో నుంచి మొండాన్ని బయటకు తీశారు.దీంతో ఆ చిన్నారి బయట ప్రపంచానికి రాకుండానే కన్ను మూసింది.

చనిపోయిన పాప తండ్రి అబ్దుల్ నాసిర్ మాట్లాడుతూ నిర్లక్ష్యంతో పసిపాప తల, మొండెం వేరు చేయడమే కాకుండా తన భార్య గర్భంలో మిగిలిన మొండాన్ని తీయడంలో ప్రయివేటు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. దీంతో అతను క్వెట్ట్ ప్రెస్ క్లబ్‌కు వెళ్లి తన నిరసన తెలిపారు. ఆయనకు తోడుగా బంధువులు, మిత్రులు తరలి వచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తన నిర్లక్ష్యంతో నవజాత శిశువు తల, మొండాన్ని ప్రయివేటు ఆసుపత్రి డాక్టర్ వేరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం కావాలని నవజాత శిశువు తండ్రి, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.విన్నారుగా ఈ డాక్టర్స్ నిర్లక్ష్యం వలన ఒక చిన్నారి నిండు ప్రాణం ఎలా పోయిందో.