పాక్ కి చావుదెబ్బే…ఆయుధమే లేని చోట యుధ్ధమా…!!

79

పాకిస్తాన్… భారత దేశంలో ఓ మాదిరి రాష్ట్రమంత కూడా భౌగోళిక విస్తీర్ణం ఉండదు. కానీ 72 ఏళ్ళ పాటు నరకమే చూపించింది. కంట్లో నలుసుగా మారింది. దాయాది అన్న మాటకు అచ్చమైన సంకేతంగా నిలిచింది. తన గురించి కూడా చూడకుండా భారత్ నాశనం కోరుకుంది. పాక్ లో ఉన్న వారు కూడా ఒకపుడు భారతీయులే, సోదర సమానులే. వారంతా కఠిక పేదరికంతో అలమటిస్తున్నారు. విద్య, వైద్య సదుపాయలు అక్కడ పెద్దగా లేవు. కానీ మతం మత్తు మాత్రం మెదళ్ళలో నూరేసి వారిలో భారత్ విష బీజాలు నాటింది. కాశ్మీర్ ని రావణ కాష్టంగా రగిల్చి ఓ ఆట ఆడుకుంది. కశ్మీర్‌లో ఎలాంటీ హింసాయుత పరిణామాలు చెలరేగకుండా చర్యలు చేపట్టిన మోడీ భారత దేశ అంతర్గత వ్యవహరంగా భావిస్తున్న కశ్మీర్ విభజనపై పాకిస్థాన్ రాద్ధంతాం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రింద వీడియో చూడండి

ఈ నేపథ్యంలోనే భారత్ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో పాటు కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలని భావిస్తోంది. కేంద్రబలగాల ఆధీనంలో ఉన్న కశ్మీర్ ఇప్పుడు బాగానే ఉంది, అసలు విషయం ముందుంది అంటూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ట్వీట్ చేశాడు. కర్ఫ్యూ తొలగించిన తర్వాత జరిగే పరిణామాలపైనే అంతర్జాతీయ దేశాలు ఎదురు చుస్తున్నాయని పేర్కోన్నారు. అయితే కాశ్మీర్ విభజన తర్వాత మోడీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్ ప్రజల కోసం భారత్ ఇచ్చిన 370 ఆర్టికల్ ని పాక్ చేతుల్లోకి తీసుకుని ఆయుధంగా వాడుకుంది. ఆ ఆయుధాన్ని విరిచేశామని ప్రధాని మోడీ అన్నారు. జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పాక్ కాశ్మీర్ వైపు ఇకపై కన్నెత్తి కూడా చూడకుండా చేస్తామని చెప్పారు.

Image result for pakistan prime minister imran khan

దేశంలో అమలవుతున్న చట్టాలేవీ కాశ్మీర్లో అమలు కావు, అక్కడ విద్య, వైద్యం అంతంతమాత్రం, అభివ్రుద్ధి లేదు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత చెడు మార్గం పట్టింది. అటువంటి వారికి ఉపాధిని కల్పిస్తాం. కాశ్మీర్ ని భూతల స్వర్గంగా మారుస్తామని ప్రధాని చెప్పారు. కాశ్మీర్ ని గొప్ప టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని చెబుతూ మొత్తం రోడ్ మ్యాప్ ని ఆయన ప్రకటించారు. ఇకపై కాశ్మీర్లో అభివ్రుద్ధి పరుగులు పెడుతుంది. అక్కడ ప్రజలకు కూడా అన్నింటా భాగస్వామ్యం దొరుకుతుంది. ఒకే జెండా అజెండాగా కాశ్మీర్ భారత్ లో కలసి అడుగులు వేస్తుందని మోడీ ఉద్వేగంగా చెప్పారు. కాశ్మీర్లో పంచాయతి నుంచి అసెంబ్లీ వరకూ ఎన్నికలు జరిపిస్తాం, కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకువస్తాం, కొత్త ముఖ్యమంత్రులను కాశ్మీర్ చూడబోతోంది అని మోడీ చెప్పారు. ఓ విధంగా దేశానికి, కాశ్మీర్ కి నవశకం ఇది అంటూ ఆయన అన్న మాటలు కాశ్మీర్ పౌరులతో పాటు, జాతి యావత్తుని ఆనందంతో ముంచెత్తేవే. అదే సమయంలో ఏ మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా పాక్ రెచ్చగొడితే మాత్రం చావు దెబ్బ తీస్తామని ప్రధాని హెచ్చరించడం విశేషం. కాశ్మీర్ మా అంతర్భాగం, మా ఇల్లు మేము చక్కదిద్దుకుంటున్నాం, ఎవరైనా కాదని వస్తే వారి అంతు తేల్చేస్తామని పాక్ కి గట్టి జవాబే మోడీ చెప్పారు. మరి పాక్ భారత్ మధ్య జరుగుతున్న ఈ రాద్ధాంతం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.