పాకిస్తాన్ మరో కుట్ర: పావురాలకు సెన్సార్లు పెట్టి.. ఇండియాలోకి వదిలి వాటితో ఏం చేయిస్తున్నారో తెలిస్తే షాక్

234

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జైషే మహ్మద్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్తాన్‌లోని బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించింది. ఆ మరుసటి రోజే పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సైనిక స్థావరాలపై గురిపెట్టడంతో ఇరు వైమానిక దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఐఏఎఫ్‌కి చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానం దాడికి గురికావడంతో… దాన్ని నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అందులో నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పారాచూట్ సాయంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బింబెర్ జిల్లా హోరాన్ గ్రామంలో ఆయన దిగారు. పాకిస్తాన్ గడ్డపై అభినందన్ దిగిన తర్వాత ఏం జరిగింది అనేది తెలిసిందే.. అయితే చివ‌ర‌కు యుద్దం అంచుల వ‌ర‌కూ వెళ్లిన భార‌త్ ,దుందుడుకు చూసిన పాక్ వెంట‌నే అభినంద‌న్ ను భార‌త్ కు తిరిగి అప్ప‌చెప్పింది. అయితే క‌వ్వింపు చ‌ర్య‌లు మాత్రం ఆప‌లేదు కాని భార‌త్ సీక్రెట్స్ తెలుసుకునేందుకు అనేక ఎత్తులు వేసింది. ఇటీవ‌ల రాజ‌స్ధాన్ లో భార‌త్ కు సంబంధించిన పోలీస్ యాక్టివిటీస్ ఆర్మీ వివ‌రాలు తెలియ‌చేస్తున్నాడు అంటూ ఓ అనుమానితుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

     ఇక తాజాగా పావురాల‌కు సెన్సార్ల‌ను అమ‌ర్చి భార‌త్ భూభాగంలో ఆర్మీ ఎలాంటి ర‌క్ష‌ణ  చ‌ర్య‌లు తీసుకుంటోంది.. ఎలాంటి ఎత్తులు వేస్తోంది.. ఇక్క‌డ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్ద గురించి, భార‌త  ఆర్మీ గురించి పాటూన్ల సైన్యం గురించి తెలుసుకుంటోంది.. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల కొన్ని పావురాల కాళ్ల కింద బెల్ట్ కు అమ‌ర్చిన సెన్సార్ల ద్వారా తెలుసుకున్నారు పోలీసులు.. వాటిని ప‌ట్టుకుని సెన్సార్ల‌ను తొల‌గించారు. అయితే ఇలా స‌మాచారం ఓ నెల రోజుల నుంచి సేక‌రిస్తున్నారా లేదా ఎప్ప‌టి నుంచి సేక‌రిస్తున్నారు అనేది తెలుసుకుంటున్నారు. మొత్తానికి దాయాది దేశం ఎలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుందో తెలుసుకుని పోలీసులు ఆర్మీ అధికారులు జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ముఖ్యంగా ఇక్క‌డ సెన్సార్ల ద్వారా అన్ని విష‌యాలు తెలుసుకుంటున్నారు అనేది తేల్చారు... వీరికి త‌గిన బుద్ది చెబుతాము అని చెబుతున్నారు ఆర్మీ అధికారులు.. ఇప్ప‌టికే ర‌క్ష‌ణశాఖ అధికారుల‌కు ఈ సెన్సార్ల‌ను అప్ప‌గించారు, వీటి నుంచి ఎలాంటి డేటా ట్రాన్స్ ఫ‌ర్ చేశారు అనేది తెలుసుకుంటున్నారు.