పాక్ ఆర్మీ అభినందన్ ని 24 గంటలు నిలబెట్టి కొట్టారు

289

ఇటీవల ప్రపంచమంతా మారుమ్రోగిన పేరు భారత్ వింగ్ కమాండర్ అభినందన్. పాక్ యుద్ధ విమానాన్ని కూల్చే ప్రయత్నంలో భారత యుద్ధ విమాన పైలట్ అభినందన్ అనుకోకుండా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు.ఆ తర్వాత జరిగింది అంతా మనకు తెలుసు.శత్రువుల చేతికి చిక్కి కూడా ధైర్యం సడలని భారత సైనికుడుగా దేశ ప్రజల గుండెల్లో నిచిలిపోయారు. తాను ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకు యావత్ ప్రపంచం అంత కూడా అతని ముందు తలవంచింది. అయితే పాక్ లో అభినందన్ ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Image result for abhinandan

పాకిస్థాన్ అధికారులు అభినందన్ నుంచి కీలక సమాచారాన్ని తెలుసుకునేందుకు ట్రై చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయినా వీడియోలో అభినందన్ టీ తాగుతూ మాట్లాడిన వీడియోను పాక్ విడుదల చేసింది. ఆ వీడియోలో అభినందన్ పేరు చెప్పాడు డీటెయిల్స్ చెప్పాడు అలాగే ఇంకా అడుగుతుంటే నేను ఆ సమాచారాన్ని చెప్పకూడదు అని చాలా దైర్యంగా పాక్ అధికారులకు చెప్పాడు.కానీ ఆ వీడియోలో చూపించినట్టు పాక్ అధికారులు నిజంగానే అంత మంచిగా చేసుకున్నారా అంటే లేదనే చెప్పుకోవాలి. 60 గంటలు పాక్ చెరలో ఉన్నాడు అభినందన్. ఆ 60 గంటలలో 24 గంటలు చాలా ఇబ్బందిపడ్డాడంట అభినందన్. గంటల తరబడి అభినందన్ ను నిలబెట్టారంట. కనీసం కింద కూడా కుర్చోనివ్వలేదంట. అలాగే కొట్టారంట కూడా. అతని మీద చెయ్యి చేసుకుని ఉక్కిరిబిక్కిరి చేశారంట అభినందన్ ను.అలాగే ఒక రూమ్ లో బందించి చెవులు పిక్కలిల్లేలా మ్యూజిక్ పెట్టారంటా.ఆ శబ్దాలకు చెవుల నుంచి రక్తం కూడా వస్తుందంట. అంతటి తీవ్రమైన పరిస్థితులను శత్రు దేశంలో ఎదుర్కొన్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

60 గంటలు పాక్ ఆర్మీ అధికారుల చేతుల్లోనే అభినందన్ ఉన్నాడు.వాళ్ళే ఇతని నుంచి కీలమైన ఇన్ఫర్మేషన్ ను తీసుకోడానికి ట్రై చేశారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే.. భారతాబాలగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఏమైనా చర్యలకు పాల్పడుతుందా అనే విషయాల గురించి తెలుసుకోవాలని ట్రై చేశారు. దీనితో పాటు హై సెక్యూరిటీ రేడియా ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకునేందుకు చాలా ప్రయత్నించారంట. కానీ అభినందన్ పాక్ అధికారులకు ఏమి చెప్పలేదు. ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఆర్మీ అధికారులకు ట్రైనింగ్ సమయంలో బాగా ట్రైన్ చేస్తారు. ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే.. ఒకవేళ శత్రు దేశానికి చిక్కితే దాదాపు 24 గంటలు ఏమి మాట్లాడకుండా ఉండేలా ట్రైనింగ్ ఇస్తారు.అభినందన్ అలా 24 గంటలు ఏమి మాట్లాడలేదు. శత్రు దేశానికి మన దేశం జవాన్ దొరికిపోతే 24 గంటలలో మొత్తం రేడియో ఫ్రీక్వెన్సీని మారుస్తారు. కాబట్టి 24 గంటలు నోరు విప్పకుండా ఉంటె చాలు. శత్రు దేశం ఏమి చెయ్యలేదు. అభినందన్ అలా 24 గంటలు ఎంత బాధపెట్టిన కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.గంటల తరబడి కొట్టినా కుర్చోనివ్వకుండా నిలబెట్టినా కూడా నోరు విప్పలేదు అభినందన్. శతవిధాలా ప్రయత్నించారంట పాక్ ఆర్మీ అధికారులు. కానీ మన సింహం నోరువిప్పలేదు అందుకే ఇప్పుడు దేశం గర్వించదగిన హీరో అయ్యాడు.మరి అభినందన్ గురించి అలాగే పాక్ ఆర్మీ అధికారుల చేతిలో అభినందన్ ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.