రాత్రికి రాత్రే గర్భవతి.. 45 నిమిషాల్లో బిడ్డ ప్రసవం!

251

ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంత సమయం పడుతుంది. ఏముంది గర్భం దాల్చిన 9 నెలల తర్వాత బిడ్డకు జన్మనిస్తుంది కదా. కానీ ఒక 18 ఏళ్ల యువతి రాత్రికి రాత్రే గర్భవతి అయ్యింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆమె కడుపు ఉబ్బి ఉంది. ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లే 45 నిమిషాల వ్యవధిలోనే ఆమె పండంటి బిడ్డను ప్రసవించింది. ఆశ్చర్యంగ ఉంది కదా. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for pregnancy

స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గోవ్‌లో నివసించే ఎమ్మలూయిజ్ లెగ్గాటే అనే 18 ఏళ్ల అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌ సీన్‌లామౌంట్‌తో కలిసి అమ్మమ్మ లూయిజ్ ఫోర్డ్ ఇంటిలో నివసిస్తోంది. ఎమ్మలూయిజ్ చిన్నవయస్సులో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని నెలల కిందట ఆమె నిద్ర నుంచి లేవగానే కడుపు ఉబ్బినట్లు కనిపించింది. నొప్పిగా ఉన్నట్లు తన అమ్మమ్మకు చెప్పింది. దీంతో ఆమె అమ్మమ్మ కారులో ఆసుపత్రికి వెళ్లింది. కారును పార్కింగ్‌లో పెట్టి ఆసుపత్రిలోకి వెళ్లిన అమ్మమ్మ తిరిగి వచ్చేసరికి ఎమ్మలూయిజ్ మగ బిడ్డను ప్రసవించింది. ఈ ఘటనలో రెండు చిత్రమైన విషయాలు ఉన్నాయి. ఒకటి.. రెండోసారి గర్భం దాల్చిన విషయం ఎమ్మలూయిజ్‌కు తెలియనే తెలీదు. అప్పటివరకు సాధారణంగా ఉన్న కడుపు రాత్రికి రాత్రి బయటకు ఉబ్బడం, అలా జరిగిన 45 నిమిషాల్లో బిడ్డను ప్రసవించడం అనేది మరో చిత్రం.

ఈ క్రింది వీడియో చూడండి

సాధారణంగా గర్భం దాల్చినప్పుడు గర్భిణీలకు వాంతులు, వికారం ఏర్పడతాయి. అలాగే కడుపు కూడా ముందుకు ఉబ్బుతుంది. 9 నెలల సమయం వచ్చే సరికి కడుపు మరింత పెద్దది అవుతుంది. కానీ, ఎమ్మలూయిజ్ విషయంలో అలా జరగలేదు. 8వ నెల వచ్చే వరకు ఆమె కడుపు లోపలికే ఉంది. దీనికి కారణం ఏమిటీ అంటే.. గర్భం వచ్చినప్పుడు రుతుస్రావం ఆగిపోతుంది. ఎమ్మలూయిజ్‌కు కూడా రుతుస్రావం ఆగింది. కానీ, అది ఆమె వాడుతున్న ట్యాబ్లెట్ల వల్ల జరిగి ఉండవచ్చని భావించింది. దీంతో వైద్యులను సంప్రదించలేదు. ఒక వేళ సంప్రదించి ఉంటే స్కానింగ్‌లో ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసి ఉండేది. బరువు కూడా పెరగడంతో అమ్మమ్మతో కలిసి వాకింగ్ చేసేది. ఇలా తెలియకుండానే ఆమె గర్భం ఎలా దాల్చిందని అమ్మమ్మ లూయిజ్ అడిగిన ప్రశ్నకు వైద్యులు స్పందిస్తూ.. బిడ్డ నడుముకు కింది భాగంలో పెరగడం వల్ల ఆమె కడుపు కనిపించలేదని తెలిపారు. ఎమ్మలూయిస్‌కు పుట్టిన బిడ్డకు 8 నెలలు నిండాయి. ఈ అరుదైన కేసు వివరాలను ‘డైలీ మెయిల్’ పత్రిక గురువారం వెల్లడించడంతో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా.. కడుపులో బిడ్డ పెరుగుతోందనే విషయం తెలియకుండానే సాధారణ జీవితం గడిపేసిన ఆమె.. అకస్మాత్తుగా రెండో బిడ్డకు జన్మనివ్వడం చిత్రమే కదూ. ప్రస్తుత తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారు.మరి ఈ మహిళ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.