అరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ కంటతడి పెట్టుకోవడం చూసి మన స్టార్ హీరోలు ఎవరెలా రియాక్ట్ అయ్యారో చూడండి

233

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే సినిమా ఎలా ఉండబోతోందో ఎన్టీఆర్ ట్రైలర్ ద్వారా చూపించారు.అయితే ఈ ఫంక్షన్ లో ఎన్టీఆర్ చాలా ఎమోషన్ అయ్యాడు.ఏడ్చాడు కూడా.అయితే అలా ఏడవడం చూసి మన స్టార్స్ ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు.మరి ఎవరెలా రియాక్ట్ అయ్యారో చూద్దామా.

అరవింద సామెత ప్రీ రీలిజ్ ఫంక్షన్ నిన్న జరిగింది.ఆ వేడుకలో తండ్రి హరికృష్ణ మరణం గురించి మాట్లాడిన ఎన్టీఆర్‌ ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేక పోయారు. దాదాపు పావుగంట సమయం మాట్లాడిన ఎన్టీఆర్‌ కన్నీరు పెట్టుకుంటూనే ఉన్నాడు. తాను కన్నీరు పెట్టుకోవడంతో పాటు ప్రేక్షకులను మరియు అభిమానుల కన్నీళ్లకు కారణం అయ్యాడు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను అలా చూడని ప్రేక్షకులు మరియు అభిమానులు ఎమోషన్‌ అయ్యారు.అయితే అభిమానులే కాదు స్టార్స్ కూడా ఎన్టీఆర్ బాధకు రియాక్ట్ అయ్యారు.ఎన్టీఆర్ కంటతడి పెట్టుకోవడం చూసిన మహేష్ బాబు…డోంట్ క్రై తారక్..నాన్న లేని లోటును ఎవరు పూడ్చలేరు..కానీ మనం ఏమి చేయలేము..నువ్వు ఏడిస్తే అభిమానులు బాధపడతారు..గతాన్ని మర్చి హ్యాపీగా ఉండు అని అన్నాడు.

అలాగే రామ్ చరణ్ స్పందిస్తూ..తారక్..నీ ఎమోషన్ ను నేను అర్థం చేసుకోగలను.కానీ ఏడిస్తే నాన్న తిరిగిరాడుగా..నువ్వు ఏడిస్తే చూసి బాధపడేవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు.కాబట్టి డోంట్ క్రై అన్నాడు..ఇక ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టమైన రాజమౌళి మాట్లాడుతూ..నేను ఇప్పటివరకు నీ కళ్ళలో ప్రేమను మాత్రమే చూశా..కానీ మొదటిసారి కన్నీళ్లను చూస్తున్నా.అలా చూడటం నాకిష్టం లేదు..అభిమానులు ఏడుస్తారు కాబట్టి యు డోంట్ క్రై అని అన్నాడు.అలాగే తారక్ స్పీచ్ విన్న వెంటనే నాగార్జున బాధపడుతూ…హరి అన్న లేకపోవడం తీరని లోటు.కానీ ఆ విషయాన్నీ పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడకూడదు.అన్నయ్య ఎప్పుడు మీరు సంతోషముగా ఉండాలనుకున్నాడు.నువ్వు అలా ఏడిస్తే పైన ఆయన ఆత్మ హ్యాపీగా ఉండదు.కాబట్టి డోంట్ క్రై అని అన్నాడు.ఎన్టీఆర్ తో అదుర్స్ తీసిన vv వినాయక్ స్పందిస్తూ…తారక్ పెదాల మీద నేను ఎప్పుడు నవ్వునే చూశా..ఇతరులను నవ్వించడమే చూశా..మొదటిసారి ఏడవడం చూస్తున్న..అభిమానుల కోసం అయినా నువ్వు నవ్వుతు ఉండాలని వినాయక్ అన్నాడు.ఇలా ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమతో అతను ఏడవడం ఇష్టం లేక అందరు స్పందించారు.