మ‌న కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం తెలిస్తే షాక‌వుతారు

240

మీకెప్పుడైనా మన కరెన్సీ నోట్ల పై గాంధీజీ బొమ్మ ఎందుకు ఉంది అనే అనుమానం వచ్చిందా , మ‌నం నార్మ‌ల్ గా ఏదైనా కొంటే వెంట‌నే డ‌బ్బులు ఇస్తాం మ‌న జాతి పిత గాంధీ కాబ‌ట్టి ఆయ‌న స్వాతంత్ర్యం కోసం పోరాడారు కాబ‌ట్టి ఆయ‌న ఫోటో ఉంది అని భావ‌స్తాం. అంతేకాని దీని గురించి ఎప్పుడూ అంత డీప్ గా ఆలోచించ‌లేదు క‌ద, అయితే దీని వెనుక ఓ పెద్ద స్టోరీ ఉంది మ‌రి ఆ స్టోరీ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ ఫోటోను ఎవరు తీశారంటే :
అసలు గాంధీజీ బొమ్మనే అన్ని కరెన్సీ నోట్ల పై ఎందుకు ముద్రించ వలసి వచ్చింది. అది కూడా గాంధీ నవ్వుతున్న ఆ ఒక్క బోమ్మనే ఎందుకు ముద్రించారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.. అసలు కల్మషం అనేదే లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో నవ్వుతున్న ఆ గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే మీరు నిజం గా ఆశ్చర్య పోతారు. ఒక సరైన ప్రయోజనం కోసం, అంత పరిపూర్ణంగా, ఎంతో ముగ్దమనోహరంగా ఉన్న గాంధీ బొమ్మ ఎలా లభించింది?ఆ ప్రతిబింబ చిత్రాన్ని మొదట అప్పుడు వాడారు :1946 వ సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరా లో బంధించాడు. కోల్ కత్తా లోని వైస్రాయ్ భవంతి లో, అప్పట్లో బ్రిటీష్ సెక్రటరీ అయిన లార్డ్ పతిక్ లారెన్స్ అనే వ్యక్తిని మహాత్మా గాంధీ 1946 వ సంవత్సరంలో కలవడానికి వెళ్లారు. ఆ సమయంలో ఈ ఫోటో తీసారట. ఆ ప్రత్యేక చిత్రాన్ని ఒకప్పుడు, అంటే 1946 లో వైస్రాయ్ భవనం గా ప్రసిద్ధి గాంచిన ప్రదేశం నుండి తీసుకున్నారు. దానినే ఇప్పుడు రాష్ట్రపతి భవనంగా పరిగణిస్తున్నాం. ఈ ఇతిహాస గాంధీ చిత్రాన్ని మన కరెన్సీ నోట్ల పై ముద్రించడానికి అనుగుణంగా మార్చుకొని మన నోట్ల పై ముద్రించడం ప్రారంభించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మహాత్మా గాంధీ యొక్క అసలు బొమ్మకు ప్రతిబింబ చిత్రాన్ని 1987 లో ముద్రించిన ఐదు వందల రూపాయల నోట్ల పై మొట్ట మొదటి సారిగా వాడారు. ఆ నోట్ల పై గాంధీ జీ చిత్రాన్ని నీటిగుర్తు గా వాడారు. ఆ నోట్లని గాంధీ శ్రేణి నోట్ల గా పిలవడం ప్రారంభించారు…గాంధీ జీ బొమ్మని ముద్రించబడ్డ కరెన్సీ నోట్లు 1996 వ సంవత్సరం నుండి చలామణిలోకి వచ్చాయి. అంతక ముందు నోట్ల పై అశోక స్తంభాన్ని ముద్రించేవారు. రిజర్వు బ్యాంక్ అఫ్ ఇండియా నోట్లను రూపాంతరం చేయాలని భావించింది.. ఇక అప్పటి నుండి ఐదు రూపాయల నోటు మొదలు కొని వెయ్యి రూపాయిల నోటు వరకు గాంధీ జీ చిత్రాన్ని వ్యాపార చిహ్నంగా ముద్రించడం ప్రారంభించింది…అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధీజీ చిత్రాన్ని అన్ని భారతీయ కరెన్సీ నోట్ల పై ముద్రించ బడుతూనే ఉంది. మరిచూశారుగా దీని వెనుక ఉన్న స్టోరీ. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.