ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే వాంతులు చేసుకుంటారు

499

ఇప్పుడు ఎవరికీ ఏం అవసరం ఉన్నా కూడా ఇంట్లో ఉండే అన్నిటిని వారి దగ్గరకు తెచ్చుకుంటున్నారు. వస్తువులు అయిన సరే తినే పదార్థం అయినా సరే ఆన్ లైన్ లో ఒక్క క్లిక్ తో తమ దగ్గరకు వచ్చేస్తున్నాయి .అందుకే అందరు ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటూన్నారు.భారత ఫుడ్ డెలివరీ కంపెనీలకు విదేశీ కంపెనీలు ఫండింగ్ పెంచడంతో ఫుడ్ డెలివరి కంపెనీలు తమ వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నాయి. కొత్త ప్లేయర్స్ వచ్చే అవకాశమున్నందున అప్పటికే ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చదువుకుని ఉద్యోగం లేని వాళ్ళందరికీ వరంగా మారింది ఫుడ్ డెలివరి.ఒక్క బైక్ ఉంటె చాలు వేలకు వేలు సంపాదించవచ్చు.అందుకే అందరు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు.అయితే ఫుడ్ డెలివరి చేసే బాయ్స్ చేస్తున్న కొన్ని పనులు ఆయా కంపెనీలకు ఇబ్బందిగా మారుతుంది.ఇప్పుడు మీకొక డెలివరి బాయ్ చేసిన పని గురించి చెబుతా వినండి.

Image result for zomato order boy

చైనా గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సిహుయి నగరంలో డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం సీసీటీవీలో రికార్డైంది.ఒక ఫుడ్ ఆర్డర్ వస్తే దానిని తీసుకెళ్ళి ఆ అడ్రెస్ కు ఇచ్చి రమ్మని హోటల్ యాజమాన్యం చెప్పింది.అతను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు.అయితే లిఫ్ట్ ఎక్కినాకనే అతని అసలు బుద్ధి బయటపడింది. లిఫ్టులో వెళుతండగా ఆ డెలివరీ బాయ్ ఆహార పదార్థాలు తినడం స్టార్ట్ చేశాడు.ఇదంతా ఆ లిఫ్ట్ లో ఉన్న సిసి కెమెరాలలో స్పష్టంగా రికార్డైంది.ఆ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో ఏముందంటే.. ప్లాస్టిక్ బాక్సును తెరిచిన డెలివరీ బాయ్ చేతులకు అంటకుండా అందులోనే నోరు పెట్టి మరీ తినేశాడు.ఆ తర్వాత చక్కగా మళ్లీ మూత పెట్టేసి కవర్‌లో ప్యాక్ చేసేశాడు.ఇంకో బాక్సులో ఉన్న సూప్ కూడా అలాగే తెరిచి కొంచెం తాగి మళ్లీ మూత పెట్టి కవర్‌లో పెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా ఎంచక్కా ఆ పార్సిల్‌ను ఆర్డర్ చేసిన వారికి ఇచ్చేందుకు వెళ్లిపోయాడు.

ఆ డెలివరీ బాయ్‌ను చైనాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ మైచువన్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. అయితే అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ వీడియో వైరల్ అవడంతో సదరు కంపెనీ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. కాగా, ఆ డెలివరీ బాయ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది వీక్షించగా, వేలాదిమంది షేర్లు చేశారు. ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని లేకుంటే ఇలాంటి పరిస్థితే వస్తుందని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.ఫుడ్ డెలివరి చేసే బాయ్స్ గురించి అలాగే డెలివరి బాయ్స్ చేసే ఇలాంటి చీప్ పనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.