ఆ కుర్రాడు చేసిన ఒక్క ఫోన్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది చివరకు రోడ్డున పడింది..అసలేమైదంటే.?

625

ఒక్క ఫోన్ కాల్ ఆమె కాపురం కూల్చేసింది.. ప్రేమించుకున్నారు కొద్ది రోజుల వ‌ర‌కూ బాగానే ఉంది ఈ లోపు ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేశారు అయినా స‌రే ప్రియుడితో త‌న ముచ్చట తీర్చుకోవ‌డం మాన‌లేదు దీంతో ఆమెకు ఎవ‌రికి రాని ఇబ్బంది వ‌చ్చింది అస‌లు విష‌యం తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు..ఫోన్‌ కాల్‌తో తన కాపురం కూల్చాడని ఓ వివాహిత యువకుడి ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన ఐనవోలు మండల కేంద్రం లో జ‌రిగింది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బాధితురాలు ఇష్టం చూపించ‌లేదు, కాని ఆ యువ‌తి పై ఆ యువకుడు మాత్రం న్యూసెన్స్‌ చేస్తుందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు..

. మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన యువతికి ఐనవోలులోని కట్కూరి నరేష్‌తో సంవత్స రం క్రితం ఒక పెళ్లి వేడుకలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. యువతికి అంతకుముందే వివాహం జరిగి విడాకులు అయ్యాయి.. అయితే తల్లిదండ్రులు మూడునెలల క్రితం మరొక సంబంధం చూసి యువతి కి వివాహం జరిపించారు.. పెళ్లి జరిగిన ఐదో రోజు నరేష్‌ ఆమెకు ఫోన్‌ చేయగా భర్త ఎత్తడంతో మేము ప్రేమించుకుంటున్నామని చెప్పాడు.
దాంతో భర్త విషయాన్ని పెద్దమనుషులకు వివరించి, ఆమెను పుట్టింటికి పంపించాడు. అత్తగారింట్లో జరిగిన విషయాన్ని యువతి నరేష్‌ కు చెప్పింది.. తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఇప్పుడు సంబంధం లేదని మోసం చేశాడని ఆరోపించింది.. దురదృష్టం కొద్ది మొదటి వివాహం భర్తతో విడాకులు జరిగితే తల్లిదండ్రులు రెండో వివాహం జరిపించగా, దానిని నరేష్‌ ఫోన్‌ చేసి కాపురం కూల్చేశాడు అని తెలిపింది. నా జీవితం నరేష్‌ చేతిలోనే ఉందని, నాకు న్యాయం చేయాలని కోరింది.

నరేష్‌ పోలీ్‌స్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. ఇద్దరి మధ్య పరిచయం ఉన్నది వాస్తవమేనని, ఆమె పెళ్లి చేసుకున్నాక నేను దూరమయ్యానని తెలిపాడు. పెళ్లయిన ఐదు రోజులకు ఆమె తనకు ఫోన్‌ చేసిందని, ఆ తర్వాత భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదన్నాడు. మొత్తానికి ఆమె మాత్రం త‌న కాపురం కూల్చాడు కాబ‌ట్టి త‌న‌కు న‌రేష్ ని ఇచ్చి వివాహం చేయాలి అని డిమాండ్ చేస్తోంది తాను మాత్రం పెళ్లి చేసుకోను అని అంటున్నాడు.