ప్రాణం తీసిన పానీ పూరి.. ఎలాగో తెలిస్తే షాక్..

297

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే ఇదే..అనే సామెత మనకు తెలుసు. చిన్నగా ఉండే విషయాన్నీ పెద్దగా చేసి కొందరు లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటారు. ఆలా తెచ్చుకున్న వాళ్ళను మనం చాలా మందినే చూశాం. ఇప్పుడు అలాంటి ఒక ఘటనే చోటుచేసుకుంది. తాగిన మైకంలో ఉన్నాడో లేదా అనుకోకుండా జరిగిందో కానీ ఒక వ్యక్తి ఆవేశ పడి చిన్న గొడవను పెద్దగా చెయ్యడం వలన ఒక వ్యక్తి ప్రాణాలే పోవాల్సి వచ్చింది. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for panipuri

పహాడీషరీఫ్ తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్‌(28) బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో మద్యం మత్తులో తన బైకుపై స్థానికంగా ఉన్న చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లాడు. పానీపూరి ఇవ్వాలని అడగ్గా అయిపోయిందని సదరు నిర్వాహకుడు చెప్పాడు. అయిపోతే ఎలా నాకు తినాలని ఉంది నాకు కావాలి అని అతను ఆ వ్యాపారి దగ్గర అన్నాడు. ఐపోయాకా వస్తే ఎలా ఇవ్వాలి సర్. ఇప్పుడు లేదు అని చెప్పాడు. అలా ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడించింది. పానీపూరి అడిగితే తనకే లేదని సమాధానం చెబుతావా అంటూ శ్రీనివాస్‌ అతనితో ఘర్షణ పడ్డాడు. అయితే వీరి గొడవను చూసి పక్కనే ఉన్న యాదయ్య అనే వ్యక్తి ఎందుకు గొడవ పడుతున్నావంటూ శ్రీనివాస్‌ను వారించాడు. మధ్యలో నీకేంటి సంబంధం రా అని శ్రీనివాస్ తాగిన మైకంలో అన్నాడు. అది విని యాదయ్య కూడా కోపోద్రికుడై శ్రీనివాస్ మీదకు గొడవకు దిగాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన శ్రీనివాస్‌ పానీపూరి బండిపై గట్టిగా బాదాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్‌ కుడి చేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. గొడవ విషయం స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి అతన్ని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చాలా రక్తం పోవడంతో శ్రీనివాస్‌ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ గొడవ మొత్తం సమీపంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ఎట్టకేలకు శుక్రవారం అరెస్ట్ చేశారు.చూశారుగా ఒక చిన్న గొడవ ఎంతటి పని చేసిందో. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామనే ద్యాస ఉండాలి లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. మరి ఈ ఘటన గురించి అలాగే ఇలా చిన్న దానిని పెద్దగా చేసే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.