రెడ్ అలర్ట్: మరోసారి కేరళలో మళ్లీ ముంచుకొస్తున్న పెను ముప్పు

308

కొంతకాలం కిందట భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో భయం వెంటాడుతోంది. దేవ‌భూమిపై మ‌రో వ‌ర్ష‌పు పంజాప‌డే అవ‌కాశం ఉంది అని అంటున్నారు ముఖ్యంగా వాతావ‌ర‌ణ శాఖ ఇప్పుడు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శని, ఆదివారాల్లో కేరళకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరించారు. ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

అక్టోబర్ 6వరకు సాధారణ వర్షాలు పడతాయని, అప్పటివరకూ ఎల్లో అలర్ట్ ప్రకటన వచ్చిటన్లు కేరళ అధికారులు తెలిపారు. మరోసారి విపత్తు హెచ్చరికల నేపథ్యంలో సమావేశంలో పినరయి విజయన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు. తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవరకూ జాలర్లు సముద్రంలో వేటకు పల వేటకు వెళ్లవద్దని, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన మూడు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరదల నుంచి కోలుకుంటున్న రాష్ట్రం.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. 40 వేల కోట్ల రూపాయ‌ల ఆస్దిన‌ష్టం సంభ‌వించింది ఇప్ప‌టికీ చాలా వ్యాపార‌స‌ముధాయాలు తిరిగి కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతాయిని చూస్తున్నాయి.

ఇక నెల‌రోజుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ మ‌ళ్లీ ఇలాంటి దారుణ స్దితికి వెళితే ఎటువంటి ప్ర‌మాదం ముంపు పొంచి ఉంటుంది అఇ తీవ్ర విచారంలో ఉన్నారు అక్క‌డ ప్ర‌జ‌లు అయితే ప్రాణాలు చేత‌ప‌ట్టుకుని ఈసారి వ‌ర్షం తీవ్ర‌త పెరిగితే ముందుగానే ఈ మూడు జిల్లాల ప్ర‌జ‌లు సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాలి అని చూస్తున్నారు అందుకే తాజాగా వీరికి ఎటువంటి స‌దుపాయాలు కావాలి అన్నా అందిస్తామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్లు తెలియ‌చేస్తున్నారు ఇక ఈ నెల‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది అని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌చేసింది ద‌క్షినాన కూడా భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని గోదావ‌రి న‌ది పోటెత్తె అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది, మ‌రి ఇప్పుడు పంబాన‌ది కూడాఉగ్ర‌రూపం నుంచి శాంతించింది ఈ స‌మ‌యంలో భారీ వ‌ర్షాలు అంటే క‌చ్చితంగా కేర‌ళ ప‌లు జాగ్రత్త‌లు తీసుకోవాల్సిందే అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు.