డ్యూటీ మానేసి టిక్ టాక్ వీడియోలతో బిజీ అయిన నర్సులు

160

టిక్ టాక్ యాప్ ఈమధ్య దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించిన సోషల్ నెట్వర్కింగ్ యాప్. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో డబ్‌స్మాష్‌ కూడా ఈ తరహా యాప్ అయినప్పటికీ టిక్ టాక్ వచ్చిన తర్వాత యువత దీనికి బాగా అలవాటుపడ్డారు. ఈ టిక్ టాక్ కారణంగా కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు,మరికొందరు ఉద్యోగాలను కూడా పోగొట్టుకొనే పరిస్థితులు ఎదురవుతున్నాయి.. ఒడిశా లోని ఓ ఆసుపత్రిలో నర్సులు ఈ టిక్ టాక్ వీడియో ల కారణంగా ఉద్యోగాలకే ఎసరు వచ్చిన పని అయ్యింది. ఇటీవల వాళ్ళు చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

ఈ క్రింది వీడియో చూడండి

మల్కన్ గిరి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే నర్సులు, పసిపిల్లల వార్డులో విధులకు కేటాయించారు. అయితే వారు చేయాల్సిన పనులను పక్కన పెట్టి టిక్ టాక్ లో కాలక్షేపం చేస్తున్నారు. పసిబిడ్డలను ఎత్తుకుని ముద్దు పెడుతూ, బాలీవుడ్‌ పాటలకు లిప్‌ మూమెంట్‌ ఇస్తూ, ఫన్నీ డైలాగులు చెబుతూ టిక్‌టాక్‌లో వీడియోలు రికార్డు చేసి అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలోకి ఎక్కడంతో ఇప్పుడు పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. నందినీ రే, రూబీ రే, తపసీ బిస్వాన్‌, జ్యోతి రే అనే నర్సుల ఉద్యోగాలకే ఇప్పుడు ఎసరొచ్చి పడింది. వారి వీడియోలను చూసిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పనులు చేయకుండా ఈ విధంగా టిక్ టాక్ వీడియోలు తీసుకుంటూ కాలక్షేపం చేయడం ఏంటి అని ఆ నర్సులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ తెలిపారు. ఒకవేళ అవసరమైతే వారిని విధుల నుంచి తొలగిస్తామని కూడా వారు తెలిపారు.

Image result for hospital nurses

బైట్ డాన్స్ అనే చైనీస్ ఐటీ కంపెనీ తయారుచేసిన ఈ యాప్ చాలా పాపులారిటీ సంపాదించింది. ఆసియా లో 500 మిలియన్ల వినియోగదారులు ఈ యాప్ కు ఉన్నారు.యువత ఈ యాప్ పట్ల చాలా క్రేజ్ తో ఉంది. తమలో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. అదే క్రమంలో టిక్ టాక్ యాప్ చాలా సందర్భాల్లో దుర్వినియోగం కూడా అవుతోంది. అందుకే దీనిని బ్యాన్ చెయ్యాలనే డిమాండ్ వినిపిస్తుంది. మరి టిక్ టాక్ యాప్ గురించి అలాగే ఈ నర్స్ ల వ్యవహారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.