బోర్ కొట్టిందని ఏకంగా 106 మందిని చంపినా ఈ నర్స్ గురించి పూర్తీగా తెలిస్తే షాక్

354

ఎన్నో ఏళ్లుగా ఒకే పని చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. ఏం జీవితంరా బాబు అని తలబాదుకుంటాం. ఒక్కొసారి ఇది పరిధి దాటిపోయి ఉన్మాదానికి దారి తీస్తుంది. అలా ఒక ఉన్మాదిలా మారిన ఒక నర్స్ కథే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. కుల, మత, వర్ణ బేధాలు లేకుండా అందరికీ సేవ చేసే పవిత్రమైన వృత్తి నర్స్.డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటివారు నర్సులు. అలాంటి నర్స్ వృత్తికే కళంకం తెచ్చాడు ఆ నర్స్.. తన అసహనమంతా అమాయకులైన రోగులపై ప్రదర్శించాడు..బోర్ కొట్టిందని ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 106 మంది రోగులను చంపేశాడు..మరి ఆ నర్స్ గురించి పూర్తీగా తెలుసుకుందామా.

జర్మనీకి చెందిన 41 ఏళ్ల నీల్స్‌ హోగెల్‌ అనే వ్యక్తి నలుగురు రోగులపై హత్యాయత్నం చేయడంతో పాటు ఇద్దరు రోగుల మృతికి కారణమని 2015లో పోలీసులు అరెస్టు చేశారు. విచారణ జరిపి జీవితఖైదు విధించారు.10 ఏళ్లుగా అతను జైలులోనే ఉన్నాడు… అయితే అతను మరిన్ని హత్యలు చేసి ఉంటాడని ఆరోపణలు రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.అతను ఒకటీ, రెండు కాదు ఏకంగా 90 మందిని బలిగొన్నాడని ఆగస్టులో తేలింది.ఆ 90 మందినే చంపాడా లేక ఇంకా ఎక్కువ మందిని చంపాడా అనే అనుమానం వచ్చి మళ్ళి విచారించారు.ఈ విచారణలో అతను మరో 16 మందిని కూడా హత్య చేసినట్లు తాజా విచారణలో వెల్లడైంది. దీంతో నీల్స్‌ చేతిలో హత్యకు గురైన వారి సంఖ్య 106కు చేరింది. 1999 నుంచి 2005 మధ్య రెండు ఆస్పత్రుల్లో నీల్స్‌ నర్సుగా పనిచేశాడు… ఈ సమయంలోనే వృత్తిపరంగా విసుగు చెంది ఈ హత్యలు చేసినట్లు నీల్స్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు…

అతను కోర్ట్ లో తానుచేసిన తప్పుల గురించి చెప్తూ… ‘నాకు విసుగెత్తేది. ఏం చేయాలో తోచక ఓవర్ డోస్ మందులు ఇచ్చిచంపేవాడిని.. కొందర్ని చావు నుంచి కాపాడ్డానికి డోస్ ఎక్కువ ఇచ్చేవాడిని.. ఇందుకు విచారిస్తున్నాను.. ’ అని హోగెల్ వెల్లడించాడు… అయితే అతను అంతటి ఘోరాలకు పాల్పడుతుంటే ఆస్పత్రి ఇబ్బంది ఏం చేశారన్నది బాధితులు నిలదీస్తున్నారు. హోగెల్ వంద కాదు, 200 మందిని చంపేసి ఉంటాడని అనుమానాస్పద మరణాలుగా భావించిన కేసుల్లో మృతదేహాలను వెలికి తీసి మళ్లీ పరీక్షలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.చూశారుగా ఈ నర్స్ ఎంతటి పని చేశాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.