ఆమె ఒకప్పుడు సెక్స్‌ బానిస..రోజు అది ఉండాల్సిందే.!కానీ ఇప్పుడు ఐక్యరాజ్యసమితి రాయబారిగా నదియా

266

నోబుల్ ప్రైజ్ అనేది ప్ర‌పంచంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారాల్లో ప్ర‌ధ‌మ‌మైన‌ది అని చెప్పాలి, అక్క‌డ నుంచి ఎంద‌రో శాంతిదూత‌లు అహింసావాదులు, పేద ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన వారు అవార్డు తీసుకున్నారు. లైంగిక హింసపై జరుపుతున్న పోరాటానికి, లైంగిక హింస బాధితులకు అందించిన తోడ్పాటుకు గుర్తింపుగా ఇద్దరికి ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించారు. కాంగోకు చెందిన గైనకాలజిస్టు డాక్టర్‌ డెనిస్‌ ముక్వెగినీ, ఇరాక్‌కు చెందిన నాదియా మురాద్‌ అనే అత్యాచార బాధితురాలిని ఈ అవార్డుకు స్వీడిష్‌ రాయల్‌ అకాడెమీ ఎంపిక చేసింది. వీరిరువురికీ 10లక్షల డాలర్లు లభిస్తాయి. మొత్తం 311 నామినేషన్లలో నుంచి వీరిద్దరినీ ఎంపిక చేశారు. ‘సాయుధ పోరాటాల్లో లైంగిక హింసను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది దారుణం. దీనికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాన్ని గుర్తించాల్సిందే. ఈ ఏడాది ఎంపిక చేసిన ఇద్దరూ తమ క్షేమాన్ని పట్టించుకోకుండా ధైర్యంగా ఆ యుద్ధ నేరాలను ఎదుర్కొన్నారు.

వారు అందించిన సేవ నిరుపమానం. బాధితుల కోసం డాక్టర్‌ డెనిస్‌ ముక్వెగి తన జీవితాన్నే ధారవోశారు. ఇక నాదియా మురాద్‌ తనపై జరిగిన దాడులే కాదు, తన జాతి పడుతున్న అవస్థల్ని ప్రపంచానికి తెలియజెప్పారు. యుద్ధాల సమయంలో, ఘర్షణల సమయంలో మహిళలు పడుతున్న బాధలు, జరుగుతున్న లైంగిక హింసలను తమకు చేతైనంతలో వెలుగులోకి తెచ్చారు అని అకాడమీ తన ప్రశంసా పత్రంలో పేర్కొంది. అంతర్యుద్ధంతో, నిత్య ఘర్షణలతో రగులుతున్న కాంగోలో మహిళలపై అఘాయిత్యాలు సర్వసాధారణం. గ్యాంగ్‌ రేప్‌లకు గురవుతున్న వేలాది మంది మహిళలకు దశాబ్దాలుగా ఉచితంగా చికిత్స చేస్తున్న డాక్టర్‌ డెనిస్‌ ముక్వెగి- బహుశా ఈ సేవ విషయంలో ప్రపంచంలోనే అగ్రగణ్యుడని స్వీడిష్‌ అకాడమీ కితాబిచ్చింది. కాంగో తూర్పు ప్రాంతంలోని బకావూ అనే పట్టణంలో ఉన్న పాంజి ఆసుపత్రిలో డాక్టర్‌ డెనిస్‌ -రేప్‌ బాధితులకు చికిత్స ఇస్తున్నారు.

ఇక- నాదియా మురాద్‌ ఇరాక్‌ ఉత్తరప్రాంతంలో కుర్దులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఉన్న యాజిదీ అనే తెగకు చెందిన మహిళ. ఆమె కళ్ల ముందే ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఆమె కన్నవారిని బంధువులను కడతేర్చి, ఊరినే స్మశానంగా మార్చి, ఆమెతో పాటు మరో మూడువేల మందిని లైంగిక బానిసలుగా మార్చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని ప్రపంచానికి తన బాధను విడమర్చి చెప్పిందామె. ఐక్యరాజ్యసమితి సైతం చలించిపోయి, ఆమెను రాయబారిగా నియమించింది. లైంగిక దాడులు, హింస కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో అత్యున్నత పురస్కారం ఆ అంశాన్ని చెప్ప‌డం విశేషం. పెరిగిపోతున్న అత్యాచారాలను నిరసిస్తూ సామాజిక దుష్కృత్యాన్ని అంతమొందించేందుకు జీవితాన్ని ధారవోస్తున్న వారికి నోబెల్‌ ప్రకటించడం విశేషాంశమని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.