పెళ్లికి ముందు ఒక‌రిని చూపించి పెళ్లి మ‌రొక‌రితో చేశారు చివ‌రకు పెళ్లి కొడుకు పెళ్ళైన 2రోజే ఏం చేసాడో తెలిస్తే షాక్

630

ఆ యువకుడు ఉన్నత చదువులు చదివాడు.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరుగుపొరుగువారితో బాగా కలిసిపోయే మనస్తత్వం క‌లిగిన వ్య‌క్తి.. అతనికి మూడు రోజుల క్రితమే పెళ్లి కూడా అయ్యింది. కాళ్ల పారాణి ఇంకా ఆరకముందే.. ఆ ఇంటి తోరణాల కళ వాడక ముందే ఆ పెళ్లింటో చావు వార్తను వినాల్సి వచ్చింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఆ ఇరు కుటుంబాల్లో ఈ ఘ‌ట‌న ఎంతో విషాదాన్ని నింపింది.

విజయనగరంలోని బాబామెట్టకు చెందిన ఎస్‌కే మదీన్‌ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే బ్యాంకు ఎంట్రన్స్‌ పరీక్ష రాసి అర్హత సాధించాడు. కొడుకు కాస్త స్థిరపడ్డాడని భావించిన మదీన్ తల్లిదండ్రులు.. సాలూరులో పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల2న విశాఖలోని ఓ కళ్యాణ మండపంలో ఘనంగా వివాహం కూడా చేశారు. పెళ్లైన మరుసటి రోజు ( ఈ నెల 3న) విజయనగరంకు వచ్చారు. 4న రిసెప్షన్‌ కూడా ఏర్పాటు చేశారు.

మదీన్ (4న) మంగళవారం ఉదయం బాబా మెట్టలోని తన పాత ఇంటికి వెళ్లాడు. అక్కడ గదిలోకి వెళ్లి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కొడుకు కనిపించకపోవడంతో షాకైన తల్లిదండ్రులు అంతా వెతికారు..అనుమానంతో పాత ఇంటికి వెళ్లి చూడగా.. మదీన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేళాడుతున్నాడు. మూడు రోజుల క్రితమే వివాహం చేసుకున్న కొడుకు ప్రాణాలు తీసుకోవడం చూసి తల్లిదండ్రులకు గుండె పగిలింది. విషయం తెలుసుకొన్న స్థానికులు కూడా షాకయ్యారు.

మూడు రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న మదీన్ ఇలా ప్రాణాలు తీసుకోవడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మదీన్ పెళ్లి కూతురు నచ్చలేదనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి చూపుల సమయంలో ఓ అమ్మాయిని చూపించి.. పెళ్లి మాత్రం మరో అమ్మాయితో చేశారని.. మోసపోయాననే బాధతో ప్రాణాలు తీసుకున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారట.వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు ఇలా ప్రాణాలు తీసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లి చేసుకొని కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని అనుకున్న మదీన్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందని స్నేహితులు, తోటి ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఆ అమ్మాయి కుటుంబం కూడా తీవ్ర విచారంలో ఉంది. మ‌రి ఇత‌ను ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు ప్రేమ వ్య‌వ‌హారం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచార‌ణ చేస్తున్నారు. మ‌రి ఇంత‌టి క‌ష్టం ఆ వ్య‌క్తికి ఏమోచ్చి ఉంటుందా అని అంద‌రూ బాధ‌ప‌డుతున్నారు.