న్యూ ఇయర్ ఆఫర్: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే?

478

రోజురోజుకు పెరిగే నిత్యావసరాల దరల వలన సామాన్యప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. మధ్య తరగతి కుటుంబాలు అయితే ధరలు పెరిగాయంటే చాలు వాళ్ళ గుండెల్లో గుబులుపుడుతుంది. ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడే పెట్రోల్ అమ్దరియూ డీజీల్ ధరలు మరియు నిత్యావసరాల వస్తువులు ధరలు పెరిగుతున్నాయి. అయితే మనకు రోజు అవసరం అయ్యే వంట గ్యాస్ సిలిండర్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. కానీ న్యూ ఇయర్ గిఫ్ట్ కింద కేంద్రం సిలిండర్ ధరను తగ్గించింది.

Image result for gas

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ‘ఇండియన్ ఆయిల్ కార్ప్’ (ఐఓసీ) వినియోగదారులకు తీపి కబురు అందించింది. సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.5.91 తగ్గించినట్లు ప్రకటించింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.500.90 నుంచి రూ.494.99కి తగ్గింది. ఐఓసీ నెల రోజుల వ్యవధిలో ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కాగా కంపెనీ డిసెంబర్ 1న కూడా సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో రూ.6.52 మేర కోత విధించింది. ఇక నాన్-సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.120.50 తగ్గిస్తున్నట్లు ఐఓసీ తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్‌పీజీ ధర దిగిరావడం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. నాన్- సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.689కు తగ్గింది. కాగా కంపెనీ ఇదివరకు డిసెంబర్ 1న నాన్- సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో రూ.133 మేర కోత విధించింది.

ప్ర‌స్తుతం ఏడాదికి, ఒక్కొక్క‌ కుటుంబానికి 14.2 కేజీల బ‌రువు గ‌ల 12 సిలెండ‌ర్‌ల‌ను ప్ర‌భుత్వం రాయితీపై అందిస్తుంది. ఈ రాయితీ సొమ్ము వినియోగ‌దారుల బ్యాంకు ఖాత‌లో నేరుగా జ‌మచేస్తారు. అంత‌ర్జాతీయ బెంచ్‌మార్క్ ఎల్‌పీజీ, విదేశీ ఎక్స్‌ఛేంజ్ రేట్ల స‌గ‌టు ఆధారంగా ప్ర‌భుత్వం వినియోగ‌దారునికి ఇచ్చే ఎల్‌పీజీ రాయితీ ప్ర‌తీ నెల మారుతూ ఉంటుంది. దేశ రాజ‌ధాని వినియోగ‌దారులు రాయితీ సిలెండ‌ర్‌పై జ‌న‌వ‌రి నెల‌లో రూ.194.01 రాయితీ పొందుతారు. ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జ‌మ‌చేస్తారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.