యాద‌గిరి గుట్ట‌లో పోలీసుల‌కు తెలియ‌కుండా కొత్త ప‌ద్ద‌తుల్లో వ్య‌భిచారం ఖంగుతిన్న పోలీసులు

480

గుట్ట‌పైన దేవుని స్మ‌ర‌ణ, గుట్ట‌కింద వ్య‌భిచార వ్య‌వ‌హారాలు యాద‌గిరి గుట్ట‌లో ఈ వ్య‌భిచార దందాల‌పై ఎన్నిసార్లు క‌థ‌నాలు వ‌చ్చినా పోలీసులు వారిని అడ్డుకుంటున్నా చాప‌కింద నీరులా ఈ వ్య‌వ‌హారం రోజు రోజుకు మ‌రింత పెరిగిపోతోంది… ఇక ఇప్పుడు పోలీసులు వ‌స్తే వారి నుంచి త‌ప్పించుకునేందుకు కొత్త ప‌ద్ద‌తులు క‌నుగొన్నారు ఇక్క‌డ వ్య‌భిచార గృహ నిర్వాహ‌కులు… ఇరుకు గదులు.. మంచం పట్టేంత జాగా.. ఆ మంచం కింద నేలమాళిగలు.. వాటిలో ఒక్కరిద్దరు మనుషులు పట్టేంత స్థలం.. ఇంటి ఆవరణ, ఖాళీ ప్రదేశాల్లో మ్యాన్‌హోల్స్‌.. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు.. అవి తెరిచి చూస్తే ఓ మనిషి పట్టేంత జాగా ఇది పాత గుట్ట‌కు వెళ్లే దారిలో కొన్ని వ్య‌భిచార గృహాల్లో క‌నిపించిన దృశ్యాలు..

Related image

వ్యభిచార గృహాలపై పోలీసులు రైడింగ్‌ చేస్తే బాలికలు, యువతులను దాచిపెట్టేందుకు చిన్నారుల శరీరాలతో సాగిస్తున్న తమ వికృత క్రీడను కప్పిపెట్టేందుకు. ఊపిరి కూడా ఆడని ఆ నేలమాళిగలు, మ్యాన్‌హోల్స్‌లో చిన్నారుల ఆర్తనాదాలను అదిమిపెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు . ఈ రాకెట్‌ వెనుక విస్తుగొలిపే అంశాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. పిల్లల శరీర అవయవాలు పెరిగేందుకు ఇంజెక్షన్ల ద్వారా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌లు ఇవ్వడం, వ్యభిచారం చేయాల్సిందిగా రాచిరంపాన పెట్టడం, దాడుల సమయంలో దాచేందుకు పక్కాగా నేలమాళిగలు, మ్యాన్‌హోళ్ల నిర్మాణాలు ఇళ్ల‌కు చేయించుకుంటున్నారు… ఇవన్నీ చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. ఈ చీకటి కూపాల నుంచి ఇప్పటికే 11 మంది చిన్నారులను పోలీసులు కాపాడారు.. అవ‌య‌వాలు పెరిగేందుకు బాలికలకు ఈస్ట్రోజన్‌ ఇంజెక్షన్‌లు ఇస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Related image

యాదగిరిగుట్ట నుంచి పాతగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యభిచార గృహాల్లో ఈ నేలమాళిగలు వెలుగు చూశాయి. ఎవరైనా అధికారులు, పోలీసులు వస్తున్నారన్న అనుమానం వస్తే చాలు నిర్వాహకులు.. చిన్నారులు, యువతులను అందులోకి పంపించేస్తారు. వారు వెళ్లిపోయాక అందులోంచి బయటికి తెస్తారు. ఎవరూ గుర్తించలేని విధంగా వీటి నిర్మాణం ఉంటుంది. భూగృహాల్లో ఇద్దరు చిన్నారుల వరకు కూర్చునే వీలుంటుంది. బయటకు రావడం ఆలస్యమైతే ఊపిరి ఆడక అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో పిల్లలు ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఇలాంటి గదులు ముంబై రెడ్‌లైట్‌ ఏరియాలో ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంటి వరండా, ఖాళీ స్థలాల్లోనూ ఇలాంటి ఏర్పాట్లే వెలుగుచూశాయి. మనిషి పట్టేంత గుంతలు తీసి పైన మ్యాన్‌హోల్స్‌ను ఏర్పాటు చేస్తారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై మంచాలు, టేబుళ్లు పెడతారు. అలాగే బీరువాలు, కప్‌బోర్డులు, డోర్ల వెనుక పిల్లలను నక్కి ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఇక్క‌డ మ‌రో దారుణం ఏమిటి అంటే ఇక్క‌డ వ్యభిచార గృహ నిర్వాహకులు పిల్లల్ని కొనుగోలు చేసేందుకు కొందరు ఫైనాన్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం ఆరా తీస్తున్నారు.. చూశారుగా ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాలు మీ ప‌క్క‌న జ‌రుగుతున్నా, దీనిపై వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయండి.. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.

జగన్ కు దగ్గరవుతున్న కమ్యూనిస్టులు..