అలర్ట్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్

140

రోడ్డు ప్రమాదాల కారణంగా భారత్‌లో ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. దీనిని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మోటార్ వెహికిల్స్ యాక్ట్‌కు సవరణలు చేసింది. ఈ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 108, వ్యతిరేకంగా 13 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లుపై పలు రాష్ట్రాల ఆందోళనలను నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. అధికారుల పోస్టింగుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ చార్జ్ విధించే హక్కు, రాష్ట్రాల ఇతర హక్కులను ఏ ఒక్కదానిని కేంద్రం తీసుకోలేదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్ర రెవెన్యూ నుంచి ఒక్క రూపాయిని కూడా కేంద్రం తీసుకోదన్నారు. డ్రైవింగ్ శిక్షణ సంస్థల ఏర్పాటుకు రాష్ట్రాలకు గల హక్కుల్లోనూ ఎలాంటి మార్పు ఉండదన్నారు. వివిధ ట్రాఫిక్ సంబంధిత నేరాలకు కఠిన శిక్షలు విధించడంతోపాటు భారీ జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారిలో ఈ బిల్లు భయాన్ని కలిగిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలను నిందితుడు చెల్లించాల్సి ఉంటుంది.

Image result for traffic police

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానాలు ఇలా ఉంటాయి. ట్రాఫిక్ ఉల్లంఘన ఛార్జ్ ఇదివరకు కనీసం రూ.100 ఉండగా, ఇప్పుడు రూ.500. గరిష్ట పెనాల్టీ రూ.10,000. లైసెన్స్ లేకుండా డ్రైవవింగ్ చేస్తే పెనాల్టీ రూ.500 నుంచి రూ.5,000కు పెంచారు. సీటు బెల్టు పెట్టుకోకుంటే పెనాల్టీ ఇదివరకు రూ.100 ఉండగా, ఇప్పుడు రూ.1,000 చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెనాల్టీ రూ.2,000 నుంచి రూ.10,000కు పెంచారు. ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.5,000 పెనాల్టీ ఉంటుంది. అత్యవసర వెహికిల్స్‌కు దారి ఇవ్వకుంటే రూ.10,000 పెనాల్టీ. కార్ల వంటి లైట్ మోటార్ వెహికిల్స్ స్పీడ్ డ్రైవింగ్‌కు రూ.1,000, హెవీ వెహికిల్స్‌కు రూ.2,000 పెనాల్టీ విధిస్తారు. రేసింగ్ అయితే రూ.5,000 వరకు డ్రైవర్‌కు జరిమానా విధిస్తారు. మీ వెహికిల్ ఇన్సురెన్స్ కవరేజ్ గడువు ముగిసిపోతే రూ.2,000 పెనాల్టీ ఉంటుంది. ఈ జరిమానాలను ప్రతి సంవత్సరం పది శాతం పెంచవచ్చు.

Image result for traffic police

ప్రస్తుతం హిట్ అండ్ రన్ కేసులో పరిహారం రూ.25,000గా ఉంది. దీనిని రూ.2 లక్షలకు పెంచారు. గాయాలపాలైన వారికి ఇదివరకు రూ.12,500 చెల్లించగా, ఇప్పుడు రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది. గోల్డెన్ హవర్‍‌లో రోడ్డు ప్రమాద బాధితులకు డబ్బులు లేకుండానే చికిత్స జరిగే విధంగా కేంద్రం ఓ స్కీం రూపొందిస్తోంది. ప్రమాదం జరిగిన ఒక గంట సేపటి నుంచి దీనిని పరిగణిస్తారు. అలాగే, రోడ్డు ప్రమాదల కేసుల్లో కంపన్షేషన్ క్లెయిమ్ కోసం ప్రమాదం జరిగిన నాటి నుంచి ఆరు నెలలు ఎక్స్‌పైరీ డేట్‌గా ప్రతిపాదించారు. ప్రతి రోడ్డు ప్రమాదం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే జరగదు. ఇతర కారణాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కొత్త మోటార్ వెహికిల్ చట్టంలో కాంట్రాక్టర్ల బాధ్యతను కూడా గుర్తించేలా ఉంది. కాంట్రాక్టర్ల బాధ్యతారాహిత్యం కారణంగా ప్రమాదాలు జరిగితే వారే బాధ్యత వహించాలి. చిన్న పిల్లలకు వాహనాలు నడిపేందుకు అనుమతి లేదు. పిల్లలు వాహనం నడిపితే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేదా వాహన యజమాని బాధ్యులు. చట్టానికి అనుగుణంగా విచారిస్తారు.

ఈ క్రింద వీడియో చూడండి

మోటార్ వెహికిల్స్ చట్టం సవరణల అనంతరం కొత్త పెనాల్టీలు ఇలా ఉంటాయి…

 • జనరల్ (177) – రూ.500
 • రహదారి ఉల్లంఘన నియమాలు (new 177A) – రూ.Rs 500
 • టిక్కెట్ లేకుండా ప్రయాణం (178) – రూ.Rs500
 • అధికారుల పట్ల దురుసు ప్రవర్తన (179) – రూ. 2000
 • లైసెన్స్ లేకుండా వాహనాలను అనధికారికంగా ఉపయోగించడం (180) – రూ.5000
 • లైసెన్స్ లేకుండా వాహనం నడపడం (181) – రూ.5000
 • అర్హత లేని డ్రైవింగ్ (182) – 10,000
 • ఓవర్ టేక్ (182B) – రూ.5000
 • ఓవర్ స్పీడ్ (183) – లైట్ మోటార్ వెహికిల్స్‌కు రూ.1000, మీడియా ప్యాసింజర్, హెవీకి రూ.2000
 • డేంజరెస్ డ్రైవింగ్ (184) – రూ.5000 వేల వరకు
 • డ్రంకన్ డ్రైవింగ్ (185) – రూ.10,000
 • స్పీడింగ్ / రేసింగ్ (189) – రూ.5,000
 • పర్మిట్ లేని వాహనం (192A) – రూ.10,000 వరకు
 • అగ్రిగేటర్స్ (193) – రూ.25,000 నుంచి రూ. 1,00,000 వరకు
 • ఓవర్ లోడింగ్ (194) – రూ.20,000, అలాగే, ప్రతి అదనపు టన్నుకు రూ.2,000
 • ప్రయాణీకుల ఓవర్ లోడింగ్ (194A) – ప్రతి అదనపు ప్రయాణీకుడికి రూ.1000
 • సీటు బెల్టు (194 B) – రూ. 1,000
 • టూవీలర్ ఓవర్ లోడింగ్ (194 C) – రూ.2,000 మరియు 3 నెలల పాటు లైసెన్స్ డిస్‌క్వాలిఫికేషన్
 • ఎమర్జెన్సీ వెహికిల్స్‌కు దారి ఇవ్వకపోవడం (194E) – రూ.10,000
 • లైసెన్స్ లేని డ్రైవింగ్ (196) – రూ.2,000
  -జువైనైల్స్ అఫెన్స్ (199) – గార్డియన్ లేదా యజమానికి రూ.25,000 జరిమానా మరియు 3 నెలల జైలు శిక్ష. మోటార్ వెహికిల్స్ రిజిస్ట్రేషన్ రద్దు. చిన్నారులపై జువైనల్ చట్టం ప్రకారం విచారణ జరుగును.