కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి.. జ‌ర జాగ్ర‌త్త‌..

269

దేశంలో దాదాపు 19 రాష్ట్రాల్లోవాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మోటార్ వెహికల్ చట్టం 2019 అమలులోకి వచ్చిన దగ్గరి నుంచి పెనాల్టీలు భారీగా పెరిగాయి. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం నడ్డివిరిగేలా జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది… ఇటీవలనే ఒక వ్యక్తికి రూల్స్ బ్రేక్ చేసినందుకు ఏకంగా రూ.80,000 జరిమానా పడింది.

Image result for traffic rules

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి ఆటలు ఇకమీదట సాగేట్టు లేవు. ఈ క్ర‌మంలోనే రాంగ్ రూట్ లో వెళ్ళేవారి తాట తీసేందుకు సిద్దం అయ్యారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రాంగ్ రూట్ లో రావడం వల్ల డేంజర్ అని, అది మీకు మాత్రమే కాకుండా ఇతర వాహనదరులకి కూడా హాని కలిగిస్తుందని అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్తే కేసు నమోదు చేయడమే కాదు జరిమానా కూడా విధిస్తున్నారు. అలాగే రోజు 400మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించారు.

Image result for traffic rules

రాంగ్‌రూట్‌లో ప్రయాణించినందుకు గాను వారిపై కేసు నమోదు చేసి వెయ్యి రుపాయలను జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ నిఘా అక్టోబర్ ఒకటి నుండే మొదలయ్యాయి. ఎక్కువగా రాంగ్ రూట్స్ జరుగుతున్న ప్రదేశాల్లో సైబరాబాద్ పోలీసులు 20 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాదాపూర్ ఎన్‌ఐఏ బిల్డింగ్, గచ్చిబౌలీ జంక్షన్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో 20 రాంగ్‌ రూట్ హాట్‌ స్పాట్లు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల జరిగే ప్రమాదాలను మనం నివారించవచ్చునని అంటున్నారు. అంతేకాదు రాంగ్ రూట్లో ప‌దే ప‌దే మీ ఇళ్లు ఆఫీసు ద‌గ్గ‌ర‌గా ఉంది అని మీరు వెళితే, రెండు మూడుసార్లు ఫైన్ వేయ‌డంతో పాటు మిమ్మ‌ల్ని అరెస్ట్ చేస్తారు అంతేకాదు, మిమ్మ‌ల్ని జైలుకి పంపి మీ బైక్ స్వాధీనం చేసుకుంటారు మీ లైసెన్స్ నాలుగు నుంచి ఐదు సంవ‌త్స‌రాలు క్యాన్సిల్ చేస్తారు, ఎందుకంటే రాంగ్ రూట్లో ప్ర‌యాణం చేయ‌డం వ‌ల్ల రోజూ 50 మంది ప్ర‌మాదాల‌కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు, అందుకే ఇంత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటోంది ప్ర‌భుత్వం.

ఈ క్రింద వీడియో చూడండి

మ‌రి ప్ర‌భుత్వం ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న నిర్ణ‌యాలు మ‌న మంచికే అని ఆలోచించాలి అందుకే హెల్మెట్ పెట్టుకుని వాహ‌నం న‌డ‌పండి, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయ‌కండి, మైన‌ర్ల‌కు బైకులు ఇచ్చి వారి జీవితాలు నాశ‌నం చేయ‌కండి. మ‌రి చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్స్ రూపంలో తెలియ‌చేయండి.

ఈ క్రింద వీడియో చూడండి