డ్రైవింగ్‌ లైసెన్స్‌కు కొత్త రూల్స్ ..ప్రతీ ఒక్కరికి తెలియచేయండి

632

మ‌నకి బండి ఉంటే సరిపోదు, రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నాము అంటే మ‌న‌కు క‌చ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.. దీనికోసం ర‌వాణాశాఖ అధికారుల ద‌గ్గ‌ర అప్లై చేసుకుంటాం. అయితే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డితే ఫైన్ అమాంతం వేల‌ రూపాయ‌ల్లో ఉంటుంది. అందుకే ప్ర‌తీ ఒక్క‌రూ క‌చ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు. అయితే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కు కొత్త రూల్ తీసుకువ‌చ్చారు. మ‌రి అధికారులు చెబుతున్న ఆ రూల్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలనుకుంటున్నారా…? అయితే 18ఏళ్లు నిండి ఓటు హక్కు నమోదు చేసుకున్నారా? లేదంటే లైసెన్స్‌ తీసుకోలేరు..! అంతేకాదు మీ వా హన రిజిస్ట్రేషన్‌ కానీ, బదిలీలు కానీ చేసుకోవడం సాధ్యం కాదు…!! ఇంకేం వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోండి. ఆ ఓటర్‌ ఐడీ లేదా ఓటు హ క్కుపత్రం తీసుకుని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి రండి…. మా సేవలు అం దిస్తాం… అవును నిజమే మీరు చదువుతున్నది ఆక్షర సత్యమే. 18ఏళ్లు ప్ర తీ ఒక్కరు ఓటు హక్కు పొందేందుకు ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్‌ జిల్లా రవాణాశాఖ అధికారి భద్రునాయక్‌ కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ ఓట‌రు కార్డు తీసుకుని అక్క‌డకు వ‌స్తున్నారు.

జిల్లా నలుమూలలనుంచి వాహనాల లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌, ఇతరత్ర వాహనాల బదిలీ లకోసం తమ కార్యాలయంకు వచ్చే వారు విధిగా ఓటు హక్కుపత్రం (కార్డు) చూపిస్తేనే వారి పనులు చేస్తామంటూ తిరకాసుపెట్టారు. 18 ఏళ్లు నిండినవారు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలనే ఆశయంతోనే ఈ నిబంధన పెడుతున్నట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలోని వివిధ గ్రూపుల్లో పోస్టింగ్‌లు పెడుతూ ఓటు నమో దు కోసం వినూత్న ప్రచారం చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. మ‌రి స‌ర్కారు భ‌లే నిర్ణ‌యం తీసుకుంది అని కామెంట్లు వ‌స్తున్నాయి