బ్యాంకుల కొత్త రూల్స్

231

మనం బ్యాంకులో సేవింగ్స్ ఖాతా వాడినా కరెంట్ ఖాతా వాడినా కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. చేయకపోతే కచ్చితంగా చార్జీలు వసూలుచేస్తాయి బ్యాంకులు.. ఖాతాదారులకు మినిమమ్ బ్యాలెన్స్ గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. బ్యాంకు అకౌంట్‌లో నెలకు కొంత మొత్తాన్ని కలిగి ఉండాలి. లేదంటే బ్యాంకులు కస్టమర్లపై పెనాల్టీలు విధిస్తాయి. అకౌంట్ కలిగిన బ్రాంచ్ ప్రాంతం ప్రాతిపదికన మినిమమ్ బ్యాలెన్స్ మారుతుంది. మీరు అర్బన్ లో ఉంటున్నారా, విలేజ్ లేదా టౌన్, మెట్రో సిటీ మీ బ్యాంకు ఖాతా ఎక్కడ ఉంటే అక్కడ బ్యాంకు చార్జ్ వసూలు చేస్తుంది.ఇక పెద్ద పెద్ద బ్యాంకులు సైతం అకౌంట్లో కచ్చితంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటాయి. అందువల్ల సంబంధిత బ్యాంకు కస్టమర్లు కూడా వారి సేవింగ్స్ అకౌంట్లలో నిర్ణీయ మొత్తాన్ని మినిమమ్ బ్యాలెన్స్ రూపంలో కలిగి ఉండాలి. లేదంటే పెనాల్టీలు పడతాయి. మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ చాలా మందికి తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు అమౌంట్ తీసేయడం వల్ల, మొదటి తారీఖు వచ్చే సరికి మీకు భారీగా చార్జీలు పడుతున్నాయి, ఇది చాలా మందికి తెలియక ఫైన్లు కడుతున్నారు. మరి ఏ బ్యాంకు ఎంత చార్జ్ వసూలు చేస్తుంది అనేది తెలుసుకుందాం.

Image result for sbi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కలిగినవారు నెలకు సగటున రూ.3,000 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అదే టౌన్ పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో అకౌంట్ ఉన్నవారు రూ.2,000, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచుల్లో అకౌంట్ కలిగి ఉన్నవారు రూ.1,000 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఇలా మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే మీకు చార్జ్ విధిస్తాయి 25 రూపాయల నుంచి 100 రూపాయల వరకూ ఉంటుంది కచ్చితంగా ఈ అమౌంట్ రోజూ అకౌంట్లో ఉండాల్సిందే.

Image result for icic

మెట్రోలు, పట్టణ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ కలిగి లేకపోతే రూ.10 నుంచి రూ.15 పెనాల్టీ పడుతుంది. దీనికి జీఎస్‌టీ అదనం. అదే సెమీ అర్బన్ ప్రాంతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ పాటించకపోతే రూ.7.5 నుంచి రూ.12 వరకు చార్జీలు వసూలు చేస్తుంది. దీనికి కూడా జీఎస్‌టీ అదనం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పెనాల్టీలు రూ.5 నుంచ రూ.10 వరకు ఉంటుంది. జీఎస్‌టీ అదనంగా తీసుకుంటాయి. ఇలా చాలా ప్రభుత్వ బ్యాంకులు తీసుకునే చార్జీ అని చెప్పాలి.

ఐసీఐసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంకులో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు రూ.10,000 మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని బ్రాంచుల కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అదే పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అకౌంట్ ఉన్న వారు రూ.5,000 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లోని బ్రాంచుల్లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.2,000గా, గ్రామీణ్ బ్రాంచుల్లో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు రూ.1,000 మంత్లీ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయాలి. అయితే ప్రైవేట్ బ్యాంకు కాబట్టి నిబంధనలు అలాగే ఉంటాయి కచ్చితంగా ఫైన్లు కూడా అలాగే విధిస్తారు.

ఈ క్రింద వీడియో చూడండి

మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్‌ను అతిక్రమిస్తే.. మెట్రో, అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ.100 పెనాల్టీ చెల్లించాలి. మినిమమ్ బ్యాలెన్స్‌కు తగ్గిన అమౌంట్‌లో 5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
మెట్రో, పట్టణ ప్రాంతాల్లోని బ్యాంక్ బ్రాంచుల్లో అకౌంట్ కలిగినవారు నెలకు ఏకంగా రూ.10,000 మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో మూడు నెలలకు రూ.2,500 మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను పాటించకపోతే రూ.150 నుంచి రూ.600 వరకు పెనాల్టీ పడుతుంది. దీనికి ఇతర పన్నులు అదనం.
ముఖ్యంగా నెలనుంచి రెండు నెలల పాటు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే ఫైన్లు మరింత పెరుగుతున్నాయి క్వార్టర్ ఫైన్లు విధించే సమయంలో 500 నుంచి 1500 రూపాయల వరకూ మినిమం బ్యాలెన్స్ ఫెనాల్టీ విధిస్తాయి. సో చూశారుగా మీరు బ్యాంకు ఖాతా ఎక్కడ తీసుకున్నారో, ఆ బ్యాంకు ఏ ఏరియా అంటే టౌన్ మెట్రో పాలిటన్ సిటీ అర్బన్ కు వస్తుందా తెలుసుకుని చార్జీలు పడకుండా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. డబ్బులు ఎవరికి ఊరికేరావు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియ చేయండి అలాగే మీ ఫ్రెండ్ కు ఈ వీడియో షేర్ చేయండి.