1 జనవరి 2019 నుండి గ్యాస్ సిలెండర్ పై కొత్త రూల్

757

ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది ఏంటి అంటే మనం గ్యాస్ బుక్ చేయగానే గ్యాస్ వస్తోంది కానీ సబ్సిడీ మన బ్యాంకు అకౌంట్ లో పడుతోందో? లేదో? అన్న డౌట్ అందరికి ఉంది. అస‌లు మ‌న‌కు చాలా బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి అలాగే బ్యాంక్ అకౌంట్ల‌లో వేటిలో స‌బ్సిడీ అమౌంట్ ప‌డుతోంది అనేదిపెద్ద డౌట్, అలాగే మ‌నం కోరుకున్న బ్యాంకు అకౌంట్లోకి డ‌బ్బులు ప‌డ‌క‌పోవ‌డంతో అస‌లు డ‌బ్బులు వ‌స్తున్నాయా లేదా అనే టెన్ష‌న్ పెరిగిపోతుంది.బ్యాంకు అకౌంట్ కి మొబైల్ అలెర్ట్ ఉన్నవారి పరిస్థితి సరే కానీ చాలామంది బ్యాంకు అకౌంట్ వినియోగదారులు మొబైల్ అలెర్ట్ పైడ్ సర్వీస్ కలిగి ఉండరు. ఇక అలాగే కొంతమందికి అకౌంట్ లో సబ్సిడీ జమవుతూనే సడన్ గా ఆగిపోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కి పని చెబితే సరిపోతుంది. మ‌రి ఇది చాలా చిన్న విష‌య‌మే మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఇలా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Image result for gas connection

ఎప్పుడు పడే గ్యాస్ రాయితీ ఈసారి పడలేదు అనగానే మొదట వేరే బ్యాంకు అకౌంట్ కి కొత్తగా ఆధార్ నెంబర్ జత చేశారు ఎమ్మో చూసుకోవాలి.నిత్యం వాడే అకౌంట్ కాకుండా ఏదన్నా బ్యాంకు ఋణం కోసం ఏదన్నా బ్యాంకు ఋణం కోసం కొత్తగా తెరిచిన అకౌంట్ కి ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నారామో చూడండి ఎందుకంటే మీరు రీసెంట్ గా మీ ఆధార్ ఏ బ్యాంకు అకౌంట్ కు ఇస్తారో అందులోనే స‌బ్సిడీ డ‌బ్బులు జ‌మ అవుతాయి… ఆ సమాచారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్ పి సి ఐ) కి వెళ్ళుతుంది ఆటోమేటిక్ గా రాయితీ పడే అకౌంట్ మారిపోతుంది.ఈ విషయం తేలియ‌క మనకు రాయితీ పడే అకౌంట్ లోనే చూసుకుంటున్నాము. ఇక్క‌డే చాలా మంది పొర‌పాటుప‌డుతున్నారు.

Image result for gas connection

ఇక మీ గ్యాస్ రాయితీ ఏ అకౌంట్ లో పడుతోందో మీరు మీ మొబైల్ నుంచే తెలుసుకోవచ్చు ఎలాగ అంటే *99 * 99 # కి డయల్ చేయాలి వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది దాని ఎంటర్ చేసి కంఫర్మ్ చేయడానికి 1 ప్రెస్ చేయాలి…ఇలా చేస్తే చాలు మీ ఆధార్ నెంబర్ చూపిస్తూ అది ఏ బ్యాంకుకు అనుసంధానం జరిగిందో చూపిస్తుంది అలాగే చివరి సారి మీకు ఎప్పుడు రాయితీ పడిందో చూపిస్తుంది. ఇక మనం వాడేది ఇండియన్ , హెచ్ పి , ఇండియన్ గ్యాస్ వీటిలో , ఏదన్నా సరే మూడింటికి ఒకటే 18002333555 టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఏదన్నా సమస్య వస్తే ఈ నెంబర్ కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వచ్చు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే మ‌రో విషయం ప్ర‌తీ పేద‌వాడికి గ్యాస్ క‌నెక్ష‌న్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం.. ఉజ్వ‌ల యోజ‌న ఉజ్వ‌ల యోజ‌న స్కీమ్ ఏర్పాటు చేశారు, అలాగే కొంద‌రికి చిన్న గ్యాస్ సిలెండ‌ర్ స‌ర్వీసుని కూడా ప్రారంభిస్తున్నారు. చిన్న సిలెండ‌ర్ ఐదుకేజీలు 290 రూపాయ‌ల‌కు ఇవ్వ‌డం జ‌రుగుతుంది. ఇక మీరుఇప్ప‌టికే గ్యాస్ తీసుకుంటున్న‌ట్లు అయితే ఓసారి మీ గ్యాస్ అకౌంట్ కి అ్ర‌డ‌స్ ఫ్రూప్ ఏమైనా ఇచ్చారా లేదా అనేది తెలుసుకోండి, ఎందుకు అంటే ఇప్ప‌టికే కొన్ని వేల అకౌంట్ల‌కు అడ్ర‌స్ ఫ్రూప్ ఇవ్వ‌లేదు అని తెలుస్తోంది, ఇలా ఫ్రూప్ ఇవ్వ‌ని వారికి వ‌చ్చే ఏడాది 2019 నుంచి గ్యాస్ స‌బ్సిడి రాదు అని చెబుతున్నారు. మ‌రి ఈ వీడియోని మీ మిత్రుల‌కి అలాగే మీ స‌న్నిహితుల‌కి షేర్ చేయండి. అలాగే ఈ తాజా నిర్ణ‌యం పై కామెంట్ల‌ను కూడా తెలియ‌చేయండి.