డ్రంక్ డ్రైవ్ ను తప్పించుకోవడానికి కుర్రాళ్లు కనిపెట్టిన కొత్త ఐడియా..చూస్తే మీరు నవ్వలేకచస్తారు..

652

దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేపడుతు తాగుబోతులతో పోలీసులు ఆడుకుంటున్నారు అని మనకు తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే తమకు చిన్నా, పెద్దా అదే పెద్దోళ్లు, సెలబ్రిటీలు అన్న తేడాలనేవి తమకు ఉండవని పోలీసులు ఎన్నో సార్లు చెప్పారు.ఎంతో మంది సెలెబ్రిటిలను పట్టుకుని ఆ మాట నిజం అని కూడా తెలియజేశారు.ఎంతవరకయినా ఇన్ఫులెన్సు చేయగలిగిన టాప్ మోస్ట్ సెలబ్రిటీకే 3ఏళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దయిందంటే ఇక సామాన్యుల సంగతి ఏం కాను అని అనుకునేలా చేసింది. మరి మామూలు మాటలా? పోలీసు హెచ్చరికలను బేఖాతరు చేస్తే ఇక వారు శిక్ష అనుభవించాల్సిందే. అందులో తాగుబోతులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అయితే పోలిసులనే వేర్రోల్లను చేస్తూ కొంతమంది తాగుబోతులు చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ అయ్యింది.మరి వారు ఏం చేశారో తెలుసుకుందామా.

Image result for drunk and drive

పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లో తప్పించుకునేందుకు గత వారంలో వాలెట్ డ్రైవర్లను వాడిన మందుబాబులు, ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. మందుబాబులు అమలు చేసిన ఈ ప్లాన్ తో వారిని ఎలా బుక్ చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.ఆ మందుబాబుల జబర్దస్త్ ప్లాన్ కి తెగ నవ్వుకుంటారు. అసలింతకీ ఏం జరిగిందంటే దగ్గర్లో బార్ ఉందో ఏం ఉందో తెలియదు కానీ చాలా మంది మందు తాగి బైక్ ల మీద వస్తున్నారు.వాళ్ళు దగ్గర దగ్గర 100 మందికి పైగా ఉంటారు.అందరు మందు తాగేసే ఉన్నారు.చుక్కేసి బైకులెక్కిన వారికి, మూల మలుపులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ కనిపించారు. ఇంకేముంది..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రతి ఒక్కరూ చక్కగా బండి దిగేసి, వాటిని నెట్టుకుంటూ పోలీసుల ముందు నుంచి వెళ్లిపోయారు. వాళ్లు మందేశారని తెలిసినా, బండిని తోపుకుంటూ వెళుతున్నారు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. అలా ఒకరు, ఇద్దరూ కాదు వందల మంది ఇలా బండి తోపుకుంటూ వెళ్లిపోయారు.తాగి బండి నడిపితే తప్పు కానీ తోపుకుంటూ వెళ్తే తప్పు కాదు కదా.అందుకే పోలీసులు కూడా వాళ్ళను ఏం చెయ్యలేకపోయారు.ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఇంకేముంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇలాంటి వారిని బుక్ చేయాలంటే మద్యం తాగి, బండిని నడపడమే కాకుండా తోపుకుంటూ వెళ్ళినా బండిని ముట్టుకున్నా కూడా శిక్షే అన్న చట్టం తేవాలేమో.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.అంతమంది తాగుబోతులు బండి తోపుకుంటూ వెళ్తున్న ఏమి అనని పోలిసుల మీద అలాగే ఇంత వెరైటీ ప్లాన్ వేసి పోలిసుల బారీ నుంచి తప్పించుకుపోయిన ఆ జనాల గురించి అలాగే ఈ ఐడియా గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.