నాతో ఒక రాత్రి పడుకోవడానికి రేటెంతో చెప్పవా అని .. హీరోయిన్ కు మెసేజ్ చేస్తే ఏమని రిప్లై ఇచ్చిందో చూస్తే షాక్

495

మీటూ ఉద్యమంతో నటీమణులు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నారు. నటించడానికి ఎన్నో కలలతో సినిమా రంగంలోకి వచ్చిన నటీమణులకు వేధింపులు తప్పడం లేదు. వారి అవసరాన్ని అలుసుగా తీసుకుని రెచ్చిపోతున్న ఉందంతాలు వెలుగు చూస్తున్నాయి. దీనిపై మీటూ పేరుతో బాలీవుడ్‌లో ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే. ఇక బయట నుంచి కూడా కొందరు వికృత ఆలోచనలు కలిగినవాళ్లు నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.అలా ఒక నటి దగ్గర ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.అయితే చివరికి అతనికి తగిన బుద్ధి చెప్పిందిలెండి.మరి ఆ నటి ఎవరు ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపు ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

నేహా సక్సేనా కన్నడ, మలయాళీ చిత్రాల్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2013 లో ఇండిస్ట్రిలోకి అడుగుపెట్టిన నేహా సక్సేనా సినిమాలతో పాటు కొన్ని టివి సీరియల్స్‌లో కూడా నటించింది. ఇటీవల ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లిన నేహాకు చేదు అనుభవం ఎదురైంది. హద్దులు దాటినా ఓ దుండగుడు అసభ్యంగా మెసేజ్ పెట్టాడు. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో లోహిదక్షన్ అనే వ్యక్తి అక్కడ నేహా సక్సెనాని చూశాడు. ఆమె మేనేజర్ కు, పిఆర్ కు నేహా రేటెంత, ఒకరాత్రి గడపడానికి అంగీకరిస్తుందా అంటూ మెసేజ్ పెట్టాడు. మేనేజర్ ఈ విషయాన్ని నేహా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సీరియస్ గా తీసుకుంది. వెంటనే అతడు వాట్సాప్ ద్వారా పెట్టిన సందేశాల్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో బహిర్గతం చేసింది. దీనితో లోహిదక్షన్ వక్రబుద్ధి ప్రపంచానికి తెలిసిపోయింది. నెటిజన్లు విమర్శలతో అతడిపై విరుచుకుపడుతున్నారు.

తనకు ఉచ్చు బిగుసుకుంటుందని భావించిన అతడు కల్లబొల్లి కబుర్లతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. నేను అలాంటి వ్యక్తిని కాదు. మహిళలతో చాలా గౌరవంగా ఉంటాను. నా ఫోన్ ని ఎవరో హ్యాక్ చేశారు అంటూ నమ్మశక్యం కానీ వివరణ ఇచ్చాడు. దీనిపై తానే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నాడు. ఇది అందరికి తెలిస్తే నా కెరీర్ నాశనం అవుతుంది. నా ఫ్యామిలీకి తెలిస్తే పరువు పోతుంది అని వాపోతున్నాడు.అతడు చెబుతున్నట్లుగా ఫోన్ హ్యాక్ అయి ఉంటే, నా పిఆర్ రిప్లై ఇచ్చినప్పుడే స్పందించి ఉండాల్సింది. నంబర్ బ్లాక్ చేసి వివరణ ఇవ్వాల్సింది. కానీ అవేమి చేయలేదు. అతడు పనిచేస్తున్న కంపెనీ వద్దకు నా స్నేహితులు వెళ్లారు. అతడు అక్కడ లేడని తెలిసింది. పైగా ఫోన్ ఆఫ్ లో ఉంది. ఇలాంటి చర్యలన్నీ అతడికి ఇంకా చిక్కులు తెచ్చిపెడతాయి. బహిరంగంగా క్షమాపణ కోరుతూ లెటర్ విడుదల చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని నేహా సక్సేనా తేల్చి చెబుతోంది.