నక్సల్స్‌ హిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రముఖ టీడీపీ నేతలు..ఆ ఇద్దరే నెక్స్ట్ టార్గెట్ .?

340

ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగిన రాజకీయ నాయకుల్లో మన్యం ఘటన వణుకు పుట్టిస్తోంది. ‘మావోయిస్టుల తదుపరి టార్గెట్‌’పై అటు పోలీసులు, ఇటు రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతోంది. పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీలు, వివిధ పార్టీల నాయకులు, పోలీసులు, మిలీషియాలో పని చేసి లొంగిపోయిన యువకులు, పోలీసు ఇన్‌ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనులు మొత్తం 200 మందితో మావోయిస్టులు హిట్‌లిస్ట్‌ తయారు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే అందులో కొంచెం ముఖ్యమైన వాళ్ళు మెయిన్ టార్గెట్ గా అనిపిస్తుంది.మరి వాళ్లెవరో తెలుసుకుందామా.

మావోయిస్టుల హిట్‌లి్‌స్టలో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్నపాత్రుడు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నట్లు తెలుస్తోంది.అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్‌, గిడ్డి ఈశ్వరి వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నాయకుడు లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బూదరాళ్ల మాజీ సర్పంచ్‌ సూరిబాబు, ఇదే మండలానికి చెందిన టీడీపీ నాయకుడు ఎం.ప్రసాద్‌, పెదబయలు మండలాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, పెదబయలు మండలం జామిగూడ మాజీ సర్పంచ్‌ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావులకు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చింతపల్లి మండలంలో 12 మందిని, జీకే వీధి మండలంలో ఎనిమిది మందిని లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే అనేక పర్యాయాలు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఇంకా ఏజన్సీలోని పలు మండలాలకు చెందిన 110 మంది ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు, గిడ్డి ఈశ్వరికి భద్రత మరింత పెంచారు. ప్రస్తుతం ఉన్న భద్రత సిబ్బందికి అదనంగా గన్‌మెన్‌ను కేటాయించాలని నిర్ణయించారు. అలాగే సివిల్‌ డ్రెస్‌లో ఉండి చుట్టుపక్కల పరిస్థితులను గమనించే ‘షాడో టీమ్‌’ను ఏర్పాటు చేయనున్నారు. అయ్యన్నకు ప్రభుత్వం ఇప్పటికే బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చింది. వీలైనంత వరకు మారుమూల ప్రాంతాలకు వెళ్లవద్దని అయ్యన్న, ఈశ్వరికి పోలీసులు సూచించారు.తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లొద్దంటూ కొంతమంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు హెచ్చరించినట్టు తెలిసింది. చూడాలి భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో