కాకినాడకు జలగండం.. భారీ విధ్వంసం జరగనుందా.. హెచ్చరించిన నాసా

488

కాకినాడను చూసినవాళ్లకు అక్కడే ఉండాలనిపిస్తుంది. సువిశాలమైన సముద్రతీరం ఉంటుంది. అందర్నీ ఆకర్షించేది ఇదే. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఎక్కువమంది పెన్షనర్లు ఇక్కడే ఉండాలనుకుంటారు. అందుకే ఇది పెన్షనర్స్ ప్యారడైజ్ గా ప్రసిద్ధి చెందింది.ఇలాంటి కాకినాడ ఇప్పుడు ప్రమాదంలో ఇరుక్కుంది.కాకినాడకు పెను ప్రమాదం తప్పదని అంటున్నారు.మరి ఎందుకు ఏమైంది.పూర్తీగా తెలుసుకుందామా.

Image result for kerla flood

ఒకవైపు కేరళ రాష్టం నాశనం అయ్యింది.ఎక్కడ చుసిన వరద చేసిన భీభత్సమే కనిపిస్తుంది. అతలాకుతలం అయిన రోడ్లు నీటిలో మునిగిపోయిన బిల్డింగ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.కేరళ పరిస్థితే త్వరలో కాకినాడకు వస్తుంది అని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.వరద నీరు భారీగా సముద్రంలో చేరుతుంది.ఇలా చేరుతున్న నీరు వలన సముద్ర మట్టం పెరుగుతుంది.ఈ సముద్ర మట్టం పెరగడమే ఇప్పుడు కాకినాడకు ప్రమాదంగా మారుతుంది.నాసా ఈమధ్య గ్రెడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్-జీఎఫ్ఎం అన్న పరికరాన్ని కనిపెట్టింది. దీని ద్వారా ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందో ముందే అంచనా వేయగలుగుతుంది. దాదాపు 293 పోర్టు పట్టణాలను పరిశోధించిన నాసా ఓ నివేదికను విడుదల చేసింది.

Image result for kerla flood

ఆ రిపోర్ట్ ప్రకారం కాకినాడకు మరో వందేళ్ల ఫ్యూచరే ఉందని అర్థమవుతోంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ లో మొదటి పది పోర్టుల్లో కాకినాడ పేరు కూడా ఉందన్న మాటే.. తీరప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కాకినాడ సముద్ర మట్టం ప్రస్తుతం 15.16 సెంటీమీటర్లు ఉంది. పదేళ్లకోసారి 1.5 సెంటీమీటరు పెరుగుతోంది. అందుకే ఈ నగరం ప్రమాదపుటంచుల్లో ఉందని హెచ్చరిస్తోంది నాసా. కాకినాడకు సమీపంలో ఉన్న ఉప్పాడ, కోన్పాపేట గ్రామాలే దీనికి సజీవ సాక్ష్యాలు. ఈ ఊళ్లు చెబుతాయి సముద్రం ముందుకు చొచ్చుకువస్తే ఏం జరుగుతుందో అని.కోన్పాపేట కాకినాడకు సమీపంలోనే ఉంటుంది. తుపాన్లు, ఆటుపోట్ల సమయంలో సముద్రుడి ఆగ్రహానికి గురవుతుందీ గ్రామం. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరిస్థితి మరీ ఘోరం. పదేళ్లుగా ఇక్కడ ఇదే సీన్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అందుకే ఈ ఊరిలో దాదాపు అరకిలోమీటరు మేర ప్రాంతం సముద్రంలో కలిసిపోయింది. గ్రామస్తుల ఆవేదనా ఇదే. ఉప్పాడ ప్రాంతానిదీ ఇదే తీరు. ఇక్కడ కూడా సముద్రం ముందుకు చొచ్చుకువస్తోంది. ఉప్పాడ తీరాన్ని ముంచెత్తుతోంది. తుపాన్లు వచ్చినప్పుడైతే క్షణమొక యుగంలా గడుపుతారీ గ్రామాల ప్రజలు.కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే కాకినాడ ప్రజల జీవన స్థితి కూడా కేరళ ప్రజల లాగే అవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ గతే కాకినాడకు పడుతుందా..రాబోయే కాలంలో కాకినాడ ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితుల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.