breakingnews : లైంగిక వేధింపుల కేసులో నారాయణ కాలేజీ డీన్ అరెస్ట్.. షాక్ లో మంత్రి నారాయణ

255

సమాజంలో స్త్రీలను లైంగికంగా వేధించేవాళ్ళు అడుగడుగునా ఉన్నారు. ఒంటరిగా వెళ్తే ఎక్కడ ఏం చేస్తారో అని భయపడి ఒంటరిగా వెళ్ళడానికే భయపడతారు మహిళలు. అయితే కొందరు అమ్మాయిలు దైర్యం తెచ్చుకుని వాళ్లకు తగిన బుద్ధి చెబుతారు.తాజాగా అలంటి ఘటనే వెలుగుచూసింది. దేశంలో పేరుపొందిన నారాయణ కాలేజీ డీన్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యాడు.కాలేజీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

Image result for girls depression

నారాయణ కాలేజీ తార్నాక బ్రాంచి డీన్ శ్రీనివాస్.. తనను వేధిస్తున్నాడని ఆరోపించారు అదే బ్రాంచిలో లెక్చరర్ గా పని చేస్తున్న ఓ మహిళ. పదేళ్లుగా నారాయణ సంస్థలో పనిచేస్తున్నా తనకు ఇబ్బంది కలగలేదనీ కొత్తగా వచ్చిన డీన్ తమను వేధిస్తున్నాడని ఆమె అన్నారు. “సంస్థలో ఇప్పటివరకు సింగిల్ కంప్లయింట్ లేదు.. డీన్ వచ్చి మొత్తం నాశనం పట్టిస్తున్నాడు.. సంస్థలో పనిచేసే ఉద్యోగులను హెరాస్ చేస్తున్నాడు. 2008 నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. నాకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్ రాలేదు.. అతనొచ్చాకే నాకు, అందరికీ ప్రాబ్లమ్ వచ్చింది. ఇండైరెక్టర్ గా టార్చర్ పెడుతున్నాడు.. కొద్దిరోజులుగా ఫోన్ చేసి హెరాస్ చేస్తున్నాడు.కాలేజీ ముగిశాక తాను ఇంటికి వెళ్లిన తర్వాత కూడా శ్రీనివాసరావు ఫోన్ చేసి వేధిస్తున్నారని బాధితురాలు మీడియాకు వివరించారు. బూతులు మాట్లాడుతున్నారని వాపోయారు. లైంగికంగా వేధిస్తున్నాడు. మేనేజ్ మెంట్ తో నాకు ప్రాబ్లమ్ లేదు. ఇతనొచ్చాకే ఫుల్లు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నాడు.. ఇతన్ని మేనేజ్ మెంట్ సస్పెండ్ చేయాలి. డీన్ మొత్తం పాలిటిక్స్ చేసి సంస్థను నాశనం చేశాడు. ప్రతి ఒక్క ఎంప్లాయ్ ను ఇబ్బంది పెడుతున్నాడు. జాబ్ లో నుంచి తీసేస్తా అని బెదిరిస్తున్నాడు. కాలేజీ అతడి అబ్బ సొమ్ములాగా అనుకుంటున్నాడు… ” అని నారాయణ కాలేజీ తార్నాక బ్రాంచి డీన్ శ్రీనివాస్ పై లేడీ లెక్చరర్ ఆరోపణలు చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మహిళా ఉద్యోగి బంధువులు కాలేజీకి వచ్చి ఆందోళన చేశారు. డీన్ పై దాడికి ప్రయత్నించడంతో.. మిగతా సిబ్బంది అడ్డుకున్నారు. బాధితురాలు, తన బంధువులతో కలిసి కాలేజీ ఆవరణలో కూర్చుని నిరసన తెలిపారు. డీన్ ను తొలగించాలంటూ నినాదాలు చేశారు.డీన్ శ్రీనివాస్ రావును 24 గంటల్లో విధుల నుంచి తొలగించాలి అంటూ ఓయూ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళ చేశారు విద్యార్థి సంఘాలు. లేకపోతే నారాయణ సెంట్రల్ ఆఫీస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. నారాయణ కాలేజీ డీన్ చేసిన లైంగిక వేధింపుల ఘటన గురించి అలాగే అతనికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ అనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.