క్యాన్సర్ బారిన మరో స్టార్ హీరోయిన్… మొన్న మనిషా కొయిరాలా నిన్న సోనాలి బింద్రే ఇప్పుడు.?

593

బాలీవుడ్ నటులు సోనాలీబింద్రే, ఇర్ఫాన్‌ఖాన్ ప్రస్తుతం క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న విషయం విదితమే. కాగా మరో ప్రముఖ నటి నసీఫా అలి కూడా క్యాన్సర్ బారినపడ్డారు. ఆమె స్టేజ్ 3కి చేరుకున్న ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తాను ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలియగానే తన స్నేహితురాలు సోనియా తనను కలుసుకొని పరామర్శించారని తెలిపారు.

అలాగే ఆమె మరో పోస్టులో తన కుటుంబ సభ్యుల ఫొటోను షేర్ చేస్తూ, వీరంతా నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారని పేర్కొన్నారు. 61 ఏళ్ల నసీఫా నటిగానే కాకుండా కాంగ్రెస్ నేతగానూ రాణిస్తున్నారు. 1976లో ‘మిస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో పాల్గొన్న నఫీసా సెకెండ్ రన్నరప్ గా నిలిచారు.