100 ఏళ్ళ క్రితం మిస్సయిన ట్రైన్.. ఇంకా దొరకలేదు!..

450

Related image

2000 సంవ‌త్స‌రానికి ముందు రైళ్లు ఎక్కువ‌గా బొగ్గు, స్టీమ్ ఇంజ‌న్ తో న‌డిచేవి , కాని ఇప్పుడు క‌రెంట్ తో న‌డిచే ట్రైన్స్ కూత‌లు పెడుతున్న ట్రైన్స్ చూస్తున్నాం…రైలు ప్రయాణమంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది… ముఖ్యంగా విమాన ప్రయాణమనేమాట వినగానే కొద్దిపాటి తడబాటు వస్తుంది… కానీ రైలులో కూర్చుని ప్రయాణించడాన్ని చిన్న పిల్లలు మొదలుకొని, వృద్ధుల వరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు.. అయితే బ‌స్ జ‌ర్నీకి అయినా నో చెబుతారు కాని, ట్రైన్ జ‌ర్నీకి ఎవ‌రూ నో చెప్ప‌రు.. ఎందుకు అంటే అంత స‌ర‌దాగా ఉంటుంది ఆ రైలు జ‌ర్నీ.. ఇక దూర ప్రాంతానికి వెళ్లాలి అంటే రాత్రి ట్రైన్ ఎక్కి కునుకు వేస్తే, ఉద‌యం ఆ ప్రాంతానికి చేరుకుంటాం.. అందుకే ట్రైన్ జ‌ర్నీల‌కు ఎక్కువ దూరం వెళ్లాలి అని అనుకునే వారు దీనికే ప్రిఫ‌రెన్స్ ఇస్తారు.

ఇక ప్ర‌పంచంలో రైల్వే వ్య‌వ‌స్ద‌కు ఎంతో ఘ‌న చ‌రిత్ర ఉంది…. అందులో ముఖ్యంగా మన దేశంలో కంటే ఇత‌ర దేశాల్లో ఈ రైల్వే వ్య‌వ‌స్ద ఎప్ప‌టి నుంచో అమ‌లులో ఉంది.. మ‌న‌కు బ్రిటిష్ కాలంలో ఈ వ్య‌వ‌స్ధ‌కి బీజం ప‌డింది అని చెప్పాలి…
ఇప్పుడు మీ అందరికి ఓ ట్రైన్ మిస్ట‌రీ గురించి తెలియ‌చేయాలి… కొన్నేళ్ల క్రితం మాయమైన రైలు ఆచూకీ ఈనాటికీ లభ్యం కాలేదు… ఆ ట్రైన్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం?

Related image

1911లో ఒక ట్రైన్ అత్యంత అనుమానాస్పద స్థితిలో మాయమైంది. జనెతి అనే పేరుతో పిలిచే ఈ ట్రైన్ ఇటాలియన్ ప్రయాణికులను తీసుకుని రోమ్ నుంచి లోంబాయీ వెళుతోంది… ఈ నేపధ్యంలో అది సొరంగ మార్గంలో ప్రయాణిస్తోంది. ఉన్నట్టుండి ప్ర‌యాణికుల‌తో ప్ర‌యాణిస్తున్న‌ ఆ ట్రైన్ మాయమైపోయింది… ఆ రైలులోని ప్రయాణికులకు కూడా తాము ఎటు పోతున్నామో అర్థం కాలేదు… మూడు బోగీలున్న ఈ ట్రైన్‌లో 106 మంది ప్రయాణీకులున్నట్టు తెలుస్తోంది. వీరిలో ఇద్దరు మాత్రం బతికి బట్టకట్టారు. వీరిద్దరూ చెప్పిన వివరాల ప్రకారం ఈ ట్రైన్ సొరంగ మార్గానికి చేరుకున్నంతలోదాని నుంచి పొగలు వ‌చ్చాయ‌ట‌. తరువాత ముందు ఏముందో కనిపించలేదు. దీంతో చాలా భయమేసి, దానిలో నుంచి వారు బయటకు దూకేశారు.

ఇక సొరంగం గుహ‌లో ట్రైన్ వెళ్లిపోయిన త‌ర్వాత నుంచి మ‌ళ్లీ క‌నిపించ‌లేదు అధికారులు వెతికినా దాని ఆచూకి కూడా క‌నిపించ‌లేదు..ఈ ట్రైన్‌లో ప్రయాణించిన వారి గురించి వెతుకులాట సాగింది. అయినా ఎటువంటి ఫలితం లేకపోయింది. ఒక కిలోమీటరు పొడవున్న ఈ సొరంగంలో రైలు ఏ మూలకు పోయిందో ఇంతవరకూ ఆచూకీ దొరకకపోవడం విశేషం…. ఇప్ప‌టికీ అది అక్క‌డ ఓ మిస్ట‌రీగానే ఉంది…. ఇక ప్ర‌యాణికులు వారి బంధువులు కూడా సుమారు 107 ఏళ్లు కావ‌డంతో ఈ మిస్ట‌రీని మ‌ర్చిపోయారు.. కాని చ‌రిత్ర‌లో ఇది ఓ మిస్ట‌రీ ట్రైన్ గా మిగిలిపోయింది.. చూశారుగా ఇలాంటి మిస్ట‌రీ వీడియోల‌తో మీ ముందుకు వ‌స్తాం, ఈ వీడియో పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.