నా భార్యకు ఏడుగురు భర్తలు అంటూ ఈ భర్త తన భార్య గురించి చెప్పిన మాటలు వింటే షాక్..

272

నిత్య పెళ్లికుమారులను చూశాం.. కానీ నిత్య పెళ్లికూతుర్లను చూడలేదు. మాయమాటలు చెప్పి పలువురిని వివాహాలను చేసుకుని మోసం చేసే మగాళ్లు ఉన్నారు.. కానీ ఈవిడ మాత్రం ఏకంగా ఎనిమిది మందిని వివాహామాడి అందరిని మోసం చేసింది. బాధిత భర్తల ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.తన భార్యకు ఇది వరకే ఏడు పెళ్లిల్లు జరిగాయని, ఆ విషయాన్ని తనకు తెలియకుండా దాచిపెట్టి మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. అంతేకాకుండా తనపై దాడికి కూడా పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.మరి ఆ భర్త ఆవేదన ఏంటో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wife and husband

బెంగళూరు నగరంలోని కేజీ హళ్ళిలో ఇమ్రాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని భార్య యాస్మిన్ బాను. వివాహం అయిన తరువాత కొంత కాలం ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. తరువాత యాస్మిన్ బాను అసలు స్వరూపం బయటపడింది. యాస్మిన్ మగవాళ్లతో తిరుగుతుందని ఇమ్రాన్ గుర్తించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని భార్యను ప్రశించడంతో యాస్మిన్ బాను భర్తను చితకబాదడం మొదలు పెట్టింది. భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేక, ఆమె చిత్రహింసలు సహించలేక ఇమ్రాన్ కేజీ హళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు యాస్మిన్ తమను గతంలో పెళ్లి చేసుకుందని షోయబ్, అఫ్జల్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద యాస్మిన్ పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని పరారైందని రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన అఫ్జల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

యాస్మిన్ తనను భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని బెదిరించిందని, డబ్బు ఇవ్వనందుకు ఆమె నన్ను వదిలి వెళ్లిపోయిందని అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం భర్తగా ఉన్నా ఇమ్రాన్ పై దాడి చేసిందని యాస్మిన్ బాను మీద పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మంది మగవాళ్లను మోసం చేసిందని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న యాస్మిన్ బాను మాయం అయ్యింది. ఆమె ఎంత మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.చూశారుగా ఈ నిత్య పెళ్లికూతురు ఎలా మోసం చేస్తుందో. మరి ఈ నిత్య పెళ్లికూతురు గురించి అలాగే ఇలా పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.