నా కూతురు వర్జిన్..ఎవరైనా పెళ్లి చేసుకోండి అని ప్రకటన ఇచ్చిన తండ్రి..

330

పెళ్లి వయసు వచ్చిన యువకులు అంతా వారికి రాబోయే భాగస్వామి గురించి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తన భాగస్వామిగా ఎవరు వస్తారో? ఎలా ఉంటుందో? అని ఆలోచిస్తుంటారు.మంచి భార్య రావాలని అందరు అనుకుంటారు.అలాగే కన్యత్వం ఉన్న పిల్లనే కావాలని కోరుకుంటారు. అలాంటి వారికోసం థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యాపారి బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన కూతురు కన్య అని ఆమెను పెళ్లి చేసుకుంటే 2 కోట్లు ఇస్తా అని ప్రకటించిండు.మరి ఎందుకు ఆ ప్రకటన ఇచ్చాడో తెలుసుకుందామా.

Image result for girls

థాయ్‌లాండ్‌కి చెందిన ఆర్నాన్ రోడాంగ్ అనే ఓ మిలియనీర్ వ్యాపారి తన కూతురిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి 2 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రకటించచాడు. ఆ ప్రకటనలో ఆయన, ”నా కూతురికి 26 ఏళ్లు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇప్పటి వరకూ చూసిన అబ్బాయిల్లో తనకు ఎవరూ నచ్చలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నా కూతుర్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి రెండు కోట్ల రూపాయలు బహుమానంగా ఇవ్వడమే కాకుండా నా వ్యాపారంలో వాటా కూడా ఇస్తాను” అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టేసాడు. ఇది చూసిన చాలా మంది ముందుగా షాకయ్యారు. మొదట్లో ఆర్నాన్ పోస్టు చూసి షాకైన నెటిజన్లు క్రమేపి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ అమ్మాయి తండ్రి రూ.2 కోట్లు ప్రకటించాడంటే ఆ అమ్మాయి అందవిహీనంగా ఉంటుందా? లేక వేరే లోపమేమైనా ఉందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

కానీ ఆర్నాన్ వాదన మరోలా ఉంది. తన కూతురిని ఏ పురుషుడు మెప్పించలేక పోతున్నాడు. పెళ్లి సంబంధాలు చూసి చూసి అలసిపోయే ఈ ఆఫర్ ప్రకటించానని తెలిపాడు. అబ్బాయి ఎంత వరకు చదువుకున్నా ఫర్వా లేదని, కష్టించి పనిచేసే తత్వం ఉంటే చాలని పేర్కొన్న ఆ ప్రకటనలో ఆసక్తి గలవారు ఏ దేశస్తులైనా కూడా పర్వాలేదనే మినహాయిస్తూ తనను సంప్రదించాలని కోరాడు. వారిలో తన కూతురికి నచ్చిన వారిని తన అల్లుడిగా చేసుకొని రెండుకోట్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. కాగా స్నేహితురాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న ఆర్నాన్ కూతురు కర్నిస్టా నవ్వేసింది. తనకు కూడా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తే భర్తగా కావాలని, అయితే ఆ రెండుకోట్లు తన దగ్గర్నుంచి తీసుకోవడం సులభం కాదని నవ్వుతూ హెచ్చరించింది.ఈ లెక్కన ఆమెకు నచ్చడం అంత ఈజీ కాదని మాత్రం అర్థమైపోతోంది. అది తెలిసే ఈ వ్యాపారి ఇలాంటి ఆఫర్ ప్రకటించారనే ప్రచారం జరుగుతోంది. భారతదేశంలోలా థాయ్‌లాండ్‌లో వరకట్న విధానం లేదు, అక్కడ ఇప్పటికీ కన్యాశుల్కం పద్ధతినే అనుసరిస్తారు. అలాంటిది  ఆ సంప్రదాయాన్ని కూడా పక్కనబెట్టి ఈ ప్రకటన చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరీ ఈ తండ్రి ఇచ్చిన ఈ ప్రకటన గురించి అతను ప్రకటనలో తెలిపిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.