భార్యలును అద్దెకు ఇచ్చే గ్రామం వీళ్ళ ఆచారాలు చూస్తే షాక్

224

స్త్రీని దేవతగా కొలుస్తామని గొప్పలు చెప్పుకుంటాం. కానీ, ఆ స్త్రీని అంగడి వస్తువుగా చేసి బేరం పెట్టిన ప్రబుద్ధులు పురాణ కాలంలోనే కాదు, 21వ శతాబ్దంలో కూడా ఉన్నారు. ఇప్పటికే స్త్రీ గర్భం వ్యాపార వస్తువుగా మారిపోయింది. కానీ నాలుగు డబ్బుల కోసం, జానెడు పొట్ట నింపుకోవడానికి అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న భార్యను అద్దెకిస్తున్న భర్తల సంగతి తెలిస్తే సభ్యసమాజం విస్తుపోతుంది. కార్లు, బైకులు రెంట్కి ఇచ్చినట్టు భార్యలను అద్దెకిస్తున్న వైనం మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో బాహాటంగా జరుగుతున్నా నోరువిప్పి ఎవరూ మాట్లాడరు. ‘రెంట్ ఫర్ వైఫ్’ పేరుతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి మరి అక్కడ ఈసంప్రదాయం గురించి అక్కడ జరుగుతున్న ఈ దారుణాల గురించి తెలుసుకుందాం.

Image result for wife and husband in villages

మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో గ్వాలియర్ రాజపుత్రులుండే ప్రాంతం. ఇక్కడ నాలుగు పైసలు ఎక్కువున్న మగమారాజులకు ఒక అరుదైన సౌకర్యం అందుబాటులో ఉంది. వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు భర్తకు డబ్బులు ఎరగా చూపి నచ్చిన స్త్రీని అద్దెకు తెచ్చుకోవచ్చు. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిఖార్సయిన వాస్తవం. అక్కడ సీజనల్గా ఏటా కొనసాగే ఈ సంప్రదాయం పేరు ‘దడీచ ప్రథ’. కొన్ని నెలలు, లేదా కొన్ని సంవత్సరాల పాటు భార్య పాత్రలో ‘ఉండడానికి’ అక్కడ వేలాదిమంది మహిళల్ని సిద్ధంగా ఉంచుతారు. షోరూమ్స్లో బొమ్మల్ని నిలబెట్టినట్లు.. ఈ ‘భార్యల మార్కెట్లో’ ఆడవాళ్ళని వరసలో నిలబెట్టిమరీ అద్దెకిస్తారు. పైగా ఇక్కడ జరిగే ఒప్పందాలకు చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఈ డీల్ని సర్టిఫై చేస్తారు. అద్దెకాలంలో ఆ స్త్రీకి ఏమీకాకుండా చూసుకునే బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే! ఏ కారణం చేతనైనా అద్దెకు వెళ్ళిన స్త్రీ అనారోగ్యం పాలైతే అద్దెకు తీసుకున్న వ్యక్తి పూర్తిగా ఆ స్త్రీ బాధ్యతా వహించాలి.

Image result for wife and husband in villages

ఈ విషయంలో స్టాంపు పేపర్లో పక్కాగా ఉంటుంది కానీ ఎప్పుడూ ఎవరూ అలా బాధ్యత వహించరు. అద్దెకు వెళ్ళిన స్త్రీకి ఏమయినా అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు. కాంట్రాక్టు పూర్తికాకముందే అనారోగ్యంగా ఉన్న ఆ స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అయితే అన్నివిధాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మహిళనే అద్దెకు తీసుకుంటారు కనుక ఇప్పటి వరకూ ఎలాంటి సమస్య రాలేదంటారు స్థానికులు. కాకపోతే.. ఈ తంతు మొత్తంలో ఒక్కటే షరతు ఉంటుంది. అదేమంటే అద్దెకు భార్యను తీసుకెళ్ళే వ్యక్తికి అప్పటికే ఒక భార్య ఉండకూడదు. భార్యలు లేనివారే అద్దెకు భార్యలను తీసుకెళ్ళేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ షరతును చాలామంది పాటించరు. భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలను తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్న అద్దె భార్యలు గనుక బాగా నచ్చితే.. కాంట్రాక్టు రెన్యు వల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలో అయితే.. ఈ ‘భార్యల బజార్’ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. పేదరికం సృష్టించే వైపరీత్యాలలో ఇదీ ఒకటని ఈ వింత ఆచారం చెప్పకనే చెబుతోంది.

Image result for wife and husband in villages

భార్యలను అద్దెకిచ్చే ప్రక్రియ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఓ ఆచారంగా భావించే ఈ తంతు కొన్ని సంవత్సరాల పూర్వం నుంచే ఉంది.
అద్దెకు వెడుతున్న స్త్రీల మనోభావాలతో వీరికి పనిలేదు. రేటు కుదిరితే మరో మాట లేకుండా భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడి వెంట నిరభ్యంతరంగా పంపించివేస్తారు. గ్వాలియర్ ప్రాంతంలో భర్తలకు భార్యల మీద పూర్తి హక్కులుంటాయని నమ్ముతారు. ఒకసారి వివాహం జరిగితే తరువాత ఆ స్త్రీని భర్త ఏం చేసినా నోరు విప్పని సమాజం అది. వీరి ఆచార సంప్రదాయాల గురించి తెలిసిన పోలీసులు కూడా నోరు విప్పడానికి సాహసించరు. ఒక మహిళను ఎన్నిసార్లు ఎంతమంది అయినా అద్దెకు తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ స్త్రీని కొనుగోలు చేస్తారు కూడా.పిండి కొద్ది రొట్టె అన్న చందంగా వయస్సులో ఉన్న అందమైన మహిళలకు అద్దె ఎక్కువ పలుకు తుంది. కొన్నిసార్లు నెలనెలా అద్దె ఉంటుంది. మరికొన్ని సార్లు సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించే పద్ధతి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించేవారు లక్ష రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకూ చెల్లిస్తుంటారు. పదహారు నుంచి 30 సంవత్సరాల లోపు స్త్రీలకు ఎక్కువ అద్దె లభిస్తుందని స్థానికులు చెబుతారు.

Related image

ఒకసారి అద్దెకాలం పూర్తయిన తరువాత ఆ స్త్రీతో అద్దెకు తీసుకున్న వ్యక్తికి ఎలాంటి సంబంధమూ ఉండదు. ఎక్కడ నుంచి అయితే అద్దెకు తీసుకువెళ్ళారో తిరిగి అక్కడికే తీసుకువచ్చి దిగబెడతారు. అద్దెకాలం ముగిసిన తరువాత ఆ స్త్రీ ఆరోగ్యం ఎలా వున్నా వారికి ఎలాంటి సంబంధమూ ఉండదు. అద్దె సమయం పూర్తయిన తరువాత ఆ స్త్రీ గర్భం దాల్చినా, అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు. స్త్రీలు కూడా ఈ విషయంలో నోరు మెదపరు. ఒకరితో రిలేషన్షిప్ పూర్తవగానే, మరొక వ్యక్తితో రిలేషన్షిప్కి ఆమెను సిద్ధం చేస్తారు. ఇక్కడి స్త్రీలు మానసికంగా, శారీరకంగా ఇలా మారిపోవడానికి వీరుండే సమాజం కట్టుబాట్లే ప్రధానకారణమంటారు. తమ సమాజ కట్టుబాట్లను అధిగమించడానికి గ్వాలియర్ ప్రాంతంలోని స్త్రీలు ఇష్టపడరు. అందుకే ఈ అద్దెలతంతు ఇక్కడ నిరభ్యంతరంగా సాగిపోతూ ఉంటుంది. అతి కొద్దిమంది స్త్రీలు ఈ తంతును వ్యతిరేకిస్తున్నా, మెజారిటీ స్త్రీల మద్దతుతో దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలోని అమ్మాయిలు పెళ్ళికన్నా, చదువే ముఖ్యమన్న విషయాన్ని గమనించి ఆ దిశగా పయనిస్తున్నారు. అయితే వీరి సంఖ్య పరిమితంగా ఉండడంతో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు.

Related image

అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను వేరొకరికి కొంతకాలం పాటు అద్దెకివ్వడానికి ప్రధానకారణం పేదరికమే అంటున్నారు విశ్లేషకులు. ఒక్క మధ్యప్రదేశ్లోనే ఈ అనాచారం లేదు. దేశంలో మరికొన్ని గిరిజన ప్రాంతాలలో ఈ అనాచారం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అభివృద్ధిచెందిన రాష్ట్రంగా చెప్పుకునే గుజరాత్లోని నేట్రంగ్ తాలూకాలోని ప్రజాపతి అనే వ్యక్తి తన భార్యను అక్కడి పటేళ్ళకు ప్రతి నెలా ఎనిమిదివేల రూపాయలకు అద్దెకిస్తున్నాడు. ఇది ఓ పుష్కరకాలంగా సాగుతోంది. భార్యలను అద్దెకు తీసుకునే వ్యవహారంలో పిల్లల్ని కనలేని, కలగని స్త్రీలనే ఎంచుకుంటూంటారు. అద్దెకాలం ముగియగానే ఆ స్త్రీ మరో వ్యక్తికి అద్దె వస్తువు అయిపోతుంది. ఈ కార్యక్రమం సంవత్సరం మొత్తం సాగుతున్నా, సంవత్సరంలో ఓరోజుని దీనికోసం ప్రత్యేకించారు. ఈ రోజున గుజరాత్ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పురుషులు వచ్చి తమకు నచ్చిన స్త్రీని అద్దెకు తీసుకెడుతుంటారు.

Image result for wife and husband in villages madhya pradesh

సమాజంలో ఎక్కడైనా దళారులదే పైచేయిగా ఉంటుంది. ఇక్కడ కూడా వీరిదే కీలకపాత్ర. భార్యలను అద్దెకిచ్చే కార్యక్రమానికి వీరే ప్రధాన సూత్రధారులు. గిరిజన ప్రాంతాలలో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల దగ్గరకు వెళ్ళి వారికి వేల రూపాయలు ఆశచూపిస్తారు ఈ దళారులు. ఒక్కనెల లేదా ఒక సంవత్సరం భార్యను అద్దెకు పంపితే వేలు లేదా లక్షల రూపాయలు కళ్ళజూడవచ్చని ఆ కుటుంబ యజమానికి ఆశ చూపెడతారు. యవ్వనంలో ఉన్న భార్యకైతే మరింత ఎక్కువ మొత్తం ఇవ్వజూపుతారు. వీరి మాటలకు పడిపోయిన ఆ గిరిజన భర్తలు తమ భార్యలను అద్దె పద్ధతిన వేరొక వ్యక్తి దగ్గరకు పంపడానికి ఒప్పుకుంటారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

అద్దెకు తీసుకునే వ్యక్తి నుంచి ఈ దళారులు 70 వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు చేస్తారు. కానీ బాధితులకు ముట్టేది మాత్రం పది నుంచి పదిహేను వేల రూపాయలు మాత్రమే! ఇంత మొత్తం యవ్వనంలో ఉన్న భార్యలకు మాత్రమే లభిస్తుంది. మధ్యవయస్సు మహిళలయితే ఆరు నుంచి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే లభిస్తాయి. అద్దెకు వెడుతున్న స్త్రీ వయస్సు, అందచందాలు, ఆరోగ్యం తదితర విషయాల మీద వీరికిచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు నెలకు లక్ష నుంచి రెండు లక్షల వరకూ కూడా చెల్లింపులు జరుగుతాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మొత్తం ఇచ్చి ఇక్కడి స్త్రీలను తీసుకెడుతుంటారు.

Image result for wife and husband in villages

ఇదంతా బహిరంగా వ్యాపారమే! మైనర్ బాలికల మీద అద్దె వ్యాపారం ఎక్కువగా సాగుతుంటుంది. ఈ విషయంలో ఒకటి రెండు సార్లు ఇక్కడి స్త్రీలు తమ అసమ్మతిని తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేదు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి గానీ, సాక్ష్యం చెప్పడానికి గానీ ఎవరూ రారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. భార్యలను అమ్మడం లేదా, అద్దెకివ్వడం అనే పద్ధతి ఒక్క మనదేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇరవై ముఫ్పై సంవత్సరాలుగా కొన్ని దేశాలలో భార్యలను అమ్ముకోవడం, అద్దెకివ్వడంలాంటి కార్య క్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి.

Image result for wife and husband in villages

భార్యలను అమ్ముకోవడం, అద్దెకివ్వడంలాంటి వాటికి ప్రధానకారణం పేదరికం అయితే మరో కారణం ఆడపిల్లలు తగ్గిపోవడం అంటున్నారు నిపుణులు. గడచిన కొన్ని సంవత్సరాలుగా అబ్బాయిలు తమకు నచ్చిన, సరైన జోడి దొరకక పెళ్ళికాకుండా ఉండిపోతున్నారు. తమకన్నా తక్కువ స్థాయి వారినీ, తక్కువ చదువుకున్నవారినీ పెళ్ళాడడానికి మనస్సు రాక కొంతమంది అబ్బాయిలు అవివాహితులుగా ఉండిపోతున్నారు. అలాంటివారే అద్దెకు భార్యలుగా తమకు నచ్చినవారిని తెచ్చుకుంటున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం భ్రూణహత్యల ఫలితమే ఇప్పుడీ దుస్థితి అన్నవారూ ఉన్నారు. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం అనేది నిజమే అయినా ఇక్కడ పేదరికమే ప్రధానపాత్ర పోషిస్తోందనీ, దాన్ని అధిగమించేవరకూ ఇలాంటి దురాచారాలు కొనసాగుతూనే ఉంటాయనీ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి చూశారుగా సమాజంలో మార్పు రావాలి, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. దీనిని తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.