ముఖేష్ అంబానీ సోద‌రి అంత‌గా పాపుల‌ర్ అవ‌లేదు. ఎందుకో తెలుసా..? ఎవర్ని పెళ్లి చేసుకుందంటే..?

727

దీరుభాయి అంబానీ.. ఈ పేరు భార‌తీయ మార్కెట్ లో ఓ సంచ‌ల‌నం. ఈ పేరు వింటే చాలు…..ప్ర‌పంచ సంప‌న్నులు సైతం స‌లామ్ చేస్తారు. ఎటువంటి ప్రోత్సాహం లేకుండా బ్యాక్ స‌పోర్ట్ లేకుండా వ్యాపారాన్ని చేసి దేశంలో బిజినెస్ టైకూన్ అయ్యారు అంబానీలు…. జీరో నుండి స్టార్ట్ అయ్యి నేడు ఆయ‌న పేరునే ఓ బ్రాండ్ గా మ‌నముందుంచిపోయాడు ఆ బిజినెస్ ప‌ర్స‌న్ ..అటువంటి వ్య‌క్తి జీవితంలోని ఒడిదుడుకులు ఎత్తుప‌ల్లాలు చూసుకుంటే ఎన్నో న‌మ్మ‌లేని నిజాలు..విధిని ఎదురీదుతూ పైకి వ‌చ్చిన సంఘ‌ట‌న‌లు అనేకం.

కావాలంటే ఈ వీడియో చూడండి

భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా అంబానీలే నం.1 కుబేరులు. అంతేకాదు అంబానీ కుటుంబ సభ్యుల లైఫ్ స్టయిల్.. అంటే రోజువారీ జీవితంలో ఏ చిన్న అంశమైనా అమితాసక్తితో ఉంటుంది. ఎందుకంటే చెప్పులు పాలిష్ కి కూడా సగటు భారతీయుడి నెల జీతమంత ఖర్చు చేస్తారు మరి.. అందుకే కొద్ది కాలంగా ముఖేష్ అంబానీ కుటుంబాన్ని విపరీత జీవనశైలికి పర్యాయపదంగా మీడియా పేర్కొంటోంది. 10,000 కోట్ల ఆంటిలియా హౌస్ నుంచి 3 లక్షల టీ కప్పు వరకు, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమ వెనుకనున్న సంపద తాలూకు దర్పాన్ని ప్రదర్శించేందుకు వెనుకాడరు. ముంబైలోని 27 అంతస్తుల ఆకాశహర్మ్యం లాంటి ఇంటిలో 600 మంది కార్మికులు రోజూ పనిచేస్తారు.

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ.. ధీరూభాయ్ అంబానీ ఇద్ద‌రు కొడుకులు. తండ్రి ధీరూభాయ్ అంబానీ అనంత‌రం వీరిద్ద‌రూ రిల‌య‌న్స్ వ్యాపారాల‌ను బాగా అభివృద్ధిలోకి తెచ్చి మంచి పేరు సంపాదించారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ ధీరూభాయ్ అంబానీకి మ‌రో ఇద్ద‌రు కూతుళ్లు కూడా ఉన్నార‌ని మీకు తెలుసా..? అవును, ఉన్నారు. వారు ముఖేష్‌, అంబానీల‌కు సోద‌రిలు అవుతారు. కానీ అన్న‌దమ్ముళ్లు వెలుగులోకి వ‌చ్చినంత‌గా వారు జ‌నాల్లో పాపుల‌ర్ అవ‌లేదు. ఎందుకంటే..

అప్ప‌ట్లో.. అంటే.. 1978ల‌లో ధీరూభాయ్ అంబానీ కుటుంబం ముంబైలోని ఉషా కిర‌ణ్ అన‌బ‌డే అతి పెద్ద బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నంలో నివాసం ఉండేవారు. అందులో 22వ అంత‌స్తులో వారు నివ‌సించేవారు. అక్క‌డే ముఖేష్ అత‌ని సోద‌రుడు అనిల్‌, వారి సోదరిలు దీప్తి, నినా కొఠారిలు పెరిగారు.

ఇక అదే భ‌వ‌నంలో 14వ ఫ్లోర్‌లో వాసుదేవ్‌ సాల్గౌక‌ర్ అనే మ‌రో వ్యాపార వేత్త ఉండేవాడు. అత‌ని కుటుంబం ఆ ఫ్లోర్‌లో నివాసం ఉండేది. ఇక సాల్గౌక‌ర్‌కు ద‌త్తరాజ్ అనే కుమారుడు ఉండేవాడు. వాసుదేవ్‌, ధీరూభాయ్ ఇద్ద‌రూ మంచి స్నేహితులు. దీంతో వారి కుటుంబాల మ‌ధ్య రాక‌పోక‌లు ఉండేవి. ఈ క్ర‌మంలో వారి కుమారులు ద‌త్త‌రాజ్‌, ముఖేష్ అంబానీలు కూడా స్నేహితులు అయ్యారు.

అయితే ఇరు కుటుంబాల మ‌ధ్య ఉన్న స్నేహం, రాక‌పోక‌లు కార‌ణంగా దత్త‌రాజ్‌, ముఖేష్ సోద‌రి దీప్తి ల మ‌ధ్య స్నేహం ఏర్ప‌డి అది కాస్తా ప్రేమ‌కు దారి తీసింది. చివ‌ర‌కు వారు పెళ్లి చేసుకున్నారు. అనంత‌రం ద‌త్త‌రాజ్‌, దీప్తిలు ఇద్ద‌రూ గోవాలోని ప‌నాజిలో హీరా విహార్ అనే మాన్ష‌న్‌లో ఉండ‌డం మొద‌లు పెట్టారు. అలా దీప్తి త‌న సోద‌రుల‌కు కొంత దూర‌మ‌వ‌డంతో ఆమె అంత‌గా వెలుగులోకి రాలేదు. అయితే పెళ్ల‌య్యాక దీప్తి పూర్తిగా గృహిణిగానే ఉండిపోయింది. కానీ భ‌ర్త ద‌త్త‌రాజ్ మాత్రం వ్యాపారంలో బాగానే సంపాదించాడు.