క్రికెట్ కు ధోనీ గుడ్ బై సైన్యంలోకి ఎంట్రీ

135

వరల్డ్ కప్ సెమీస్‌లో భారత్ ఓటమి తరువాత టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్‌పై రిటైర్మెంట్ విషయంలో తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. అసలు ధోని లేని మ్యాచ్ లు చాలా మంది ఊహించుకోలేరు, మరి ధోనీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఫిట్ గా ఉన్నాడు మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, ఇక మనం ఆడే ప్రతీ మ్యాచ్ గెలవాలి అని లేదు కదా అని కొందరు అభిమానులు చెబుతున్నారు. అయితే సచిన్ ద్రవిడ్ గంగూలీ కుంబ్లే గవాస్కర్ సెహ్వాగ్ ఇలా ఎవరిని చూసుకున్నా అందరూ మంచి ఫామ్ లో ఉండగానే రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే దీనికి కారణం ఉంది, ఇలా చేస్తే వారు మంచి ఫామ్ లో ఉండగా రిటైర్డ్ అయ్యారు అనే పేరు వస్తుంది. పైగా వారిపై నెగిటీవ్ రిమార్క్ లేకుండా, ఆట సరిగ్గా ఆడటం లేదు కాబట్టే రిటైర్డ్ అయ్యాడు అనే విమర్శలు రావు. అందుకే చాలా మంది ఇలాంటి డెసిషన్లు తీసుకుంటారు .. ధోనిలాంటి టాప్ క్రికెటర్ కూడా ఇదే ఆలోచించాడు. సో ధోని కూడా అందుకే వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాలనుకున్నాడు, అయితే ధోని రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తాడు అనే దానిపై క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు.

Image result for క్రికెట్ కు ధోనీ గుడ్ బై సైన్యంలోకి ఎంట్రీ

ఈ సమయంలో ఓ వార్త వినిపిస్తోంది. సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సైన్యంలో చేరుతున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రపంచకప్ అనంతరం రెండు నెలల వరకు క్రికెట్‌కు దూరంగా ఉంటానని బీసీసీఐకి ధోని ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలలు ఆర్మీలో చేరి సేవలు అందిస్తానని లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని పేర్కొన్నట్లు ఓ సీనియర్ బీసీసీఐ అధికారి తెలిపారు. పారాచూట్ రెజిమెంట్ విభాగంలో చేరి దేశసైనికుడిగా ధోని మరో రెండునెలలు సేవలందిస్తాడని అన్నారు.

Image result for క్రికెట్ కు ధోనీ గుడ్ బై సైన్యంలోకి ఎంట్రీ

ధోని వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం ధోని తన ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. మరో రెండు నెలలు పారామిలటరీ రెజిమెంట్‌లో చేరి సేవలు అందించనున్నాడు. ప్రపంచకప్‌కు ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దేశ సైనికుడిగా రెండు నెలలు సేవలు అందించనున్నాడు. ఈ విషయాన్ని జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు చెప్పాం’ అని ఆ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో విండీస్ పర్యటనకు భారత జట్టును ఆదివారం ప్రకటించనున్న విషయం తెలిసిందే. ధోని హాజరు కాకపోవడంతో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు చోటుదక్కనుంది. ప్రత్యామ్నాయంగా వృద్ధిమాన్ సాహా పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది.

ఈ క్రింది వీడియో ని చూడండి


ఇదిలా వుండగా ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోనిపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చేవలేని బ్యాటింగ్ చేస్తున్నాడని.. ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదనే విమర్శలు వినిపించాయి. కాని చాలా మంది ధోని నిర్ణయం తప్పు అంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్ కంటే మరో రెండు సంవత్సరాలు భారత్ తరపున క్రికెట్ ఆడాలని ధోనిని కోరుకుంటున్నారు, కెప్టెన్ బాధ్యతలు వేరేవారికి ఇచ్చిన ధోనీ బ్యాటింగ్ లో ఇంకా రాణిస్తున్నాడు కాబట్టి ధోనీ మరో ఏడాది కొనసాగాలని జట్టు సభ్యులు కూడా కోరుకుంటున్నారు.ధోని టీమ్ ఇండియాలో జట్టు సభ్యుడిగా ఉండాలి అని భావిస్తున్నారా, లేదా రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారా ,మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.