కాశ్మీర్ లో ధోని చేసిన పనికి మోడీ సైతం షాక్

286

భారత ఆర్మీలో పనిచేయాలనే కోరికతో క్రికెట్‌కు రెండు నెలల పాటు విశ్రాంతిని ఇచ్చిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం కశ్మీర్‌ లోయలో సైనిక విధుల్లో బిజీగా ఉన్నాడు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో భారత పారామిలటరీ విభాగంలో అతను పనిచేస్తున్నాడు. ధోనీ ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లద్దాక్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసి.. జమ్ముకశ్మీర్‌, లద్దాక్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. జమ్ముకశ్మీర్‌లోని ప్రతి గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ధోనీ లద్దాక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తుండడం విశేషం. ప్రస్తుతం పుల్వామా జిల్లా క్రూ ప్రాంతంలో పారా రెజిమెంట్‌ యూనిట్‌లో ధోనీ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 10న తన బృందంతో కలిసి లేహ్‌ వెళతాడని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.

ఈ క్రింద వీడియో చూడండి

‘ధోనీ భారత ఆర్మీకి బ్రాండ్‌ అంబాసిడర్‌. ప్రస్తుతం అతను తన యూనిట్ సభ్యులను ప్రేరేపించడంలో నిమగ్నమయ్యాడు.అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. యూనిట్ సభ్యులతో కలిసి ఫుట్‌బాల్‌, వాలీబాల్‌ ఆడుతున్నాడు. సైనిక బలగాలతో కలిసి ఆర్మీ విధుల్లో పాల్గొంటున్నాడు. అలాగే యుద్ధ శిక్షణా వ్యాయామాలు కూడా చేస్తున్నాడు. ఆగస్టు 15 వరకు ధోనీ విధుల్లో కొనసాగుతాడు’ అని అధికారి పేర్కొన్నారు. ధోనీ ఒకవైపు కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు విరామ సమయంలో తోటి సైనికులను అలరిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌ ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్ నటించిన ‘కభీ కభీ’ సినిమాలోని ‘మై పల్‌ దో పల్‌కా షాయర్‌ హు’ నే పాటను పాడి తోటి సైనికులను అలరించాడు. పాట అనంతరం సైనికులు అందరూ ధోనీని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. దీంతో ధోనీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Image result for dhoni in army

విధి నిర్వహణలో ఉన్న ధోనీ తన షూస్‌ను తానే పాలిషింగ్ చేసుకుంటున్న ఓ ఫొటో కూడా రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోనీ షూస్ పాలిష్ చేసుకుంటుండడాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ధోనీ సింప్లిసిటీకి అది నిదర్శనమని కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ ఫొటోను ధోనీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. దాంతో ప్రధానమంత్రి వద్దకు ఈ విషయం వెళ్ళింది. పీఎం కూడా ధోనిని మెచ్చుకుంటున్నాడు. ధోని లాంటి వ్యక్తి ఇలా ఆర్మీ కోసం పనిచేయడం నిజంగా గొప్ప విషయం. అలాగే లద్దాక్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించే వారిలో మీరు కూడా ఒక సభ్యుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉందని పీఎం మోడీ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మరి ధోని లద్దాక్‌లోని లేహ్‌లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించడం గురించి అలాగే పీఎం మోడీ ధోని మీద చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.