మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విష‌యం..కారణం తెలిస్తే షాక్

363

సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం వేకువజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు రక్తపోటు పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సుప్రజ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి వాంతులు, ఛాతీ నొప్పితో మోత్కుపల్లి బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు.

మరోవైపు మోత్కుపల్లి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా ఆలేరు నుంచి బరిలో ఉన్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురైనట్లు తెలిసిన వెంటనే బీఎల్‌ఎఫ్ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీగా ఆస్పత్రికి తరలివస్తున్నారు. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన మోత్కుపల్లి నర్సింహులు ప్రస్తుతం రాజకీయంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలంటూ వ్యాఖ్యానించి చంద్రబాబు ఆగ్రహానికి గురైన మోత్కుపల్లి.. ఆ తర్వాత ఆయనపై సంచలన ఆరోపణలు చేశారు.

దీంతో టీడీపీ అదిష్ఠానం ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తర్వాత మోత్కుపల్లి టీఆర్ఎస్‌, జనసేనలో చేరుతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఆయనను చేర్చుకోడానికి అన్ని పార్టీలూ విముఖత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని పరిణామాల తర్వాత బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. తనను గెలిపించాలంటూ నియోజకవర్గంలో ప్రచారం చేశారు.