ఇళ్లు మంటల్లో కాలిపోతుంటే తల్లి ఇద్దరు పిల్లల్ని ఏం చేసిందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

435

ఈ విశ్వంలో వెల‌క‌ట్ట‌లేనిది ఏదైనా ఉంది అంటే అది త‌ల్లి ప్రేమ అనే చెప్పాలి.. క‌న్న‌త‌ల్లి పిల్ల‌ల‌కు ఎటువంటి ప్ర‌మాదం వ‌చ్చినా, ఆప‌ద వ‌చ్చినా వెంట‌నే కంగారు ప‌డుతుంది…. అందుకే పుట్టిన బిడ్డ‌ల‌ను ఎంత క‌ష్టం వ‌చ్చినా వ‌దులుకోకుండా జీవితాంతం త‌న‌తోనే ఉండాల‌ని కోరుకుంటుంది… ఎంత‌టి క‌ష్టం వ‌చ్చినా త‌న పిల్ల‌లు బాగోవాల‌ని ఎంత‌టి త్యాగాల‌కు అయినా మాతృమూర్తి సిద్దం అవుతుంది.

త‌న పిల్ల‌ల ప్రాణాల‌మీద‌కు వ‌చ్చినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పిల్లలను రక్షించుకుంటుంది..అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తన ఇద్దరు పిల్లల్ని మంటల బారి నుండి రక్షించి, తను మాత్రం ఆ మంటల్లో బలైపోయింది ఓ క‌న్న‌త‌ల్లి….ఈ విషాద ఘ‌ట‌న త‌ల‌చుకుంటేనే క‌న్నీరు వ‌స్తోంది….చైనాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అందరూ ఆ తల్లి సమయస్పూర్తిని,త్యాగాన్ని ప్ర‌శంసిస్తున్నారు.

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులో నివాసం ఉంటోంది. హఠాత్తుగా నాలుగో అంతస్తులో మంటలు వ్యాపించాయి.ఇంటి ఎదురుగా ఉన్నవారు చూసినప్పటికీ ఎలా కాపాడాలో తోచలేదు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో..కిటికీలు తెరిచి ఇంట్లో ఉన్న దుప్పట్లను తీసి,కిటీకిలోనుండి కిందకు విసిరేసింది. ఇరుగుపొరుగు ఆ దుప్పట్లను వలలా పట్టుకోగా.. 9 ఏళ్లు, మూడేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను ఒకరి తర్వాత ఒకరిగా కిటికీలో నుంచి కిందకు విసిరేసింది. వారిద్దరూ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

బిడ్డలను క్షేమంగా బతికించుకున్నప్పటికీ ఆమె మాత్రం మంటల నుంచి బయట పడలేకపోయింది. మంటల వేడికి అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయింది… సమాయానికి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆమెను ఇంటిలోనుండి బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చి హాస్పిటల్‌కు తరలించారు…అయినప్పటికి లాభంలేకపోయింది.చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు వదిలింది. క‌న్న‌త‌ల్లి త‌మ ప్రాణాలు కాపాడి మ‌ర‌ణించింది అని తెలియ‌డంతో త‌న పిల్ల‌లు ఇద్ద‌రూ క‌న్నీరు మున్నీరు అయ్యారు.. త‌ల్లి లేదు అనే విష‌యాన్ని పెద్ద కుమారుడు జీర్ణించుకోలేక‌పోయాడు.. చైనాలో అంద‌రూ ఆమె చేసిన పనికి ప్ర‌శంస‌లు ఇస్తున్నారు.. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని , రియ‌ల్ మ‌ద‌ర్ అని ఆమె చేసిన ప‌నికి కితాబిస్తున్నారు.. నిజంగా ఈ త‌ల్లి చేసింది చాలా ప్ర‌శంస‌నీయ‌మైంది..