కొడుకు తో ఆపని చేసిందని అక్కడ పెట్రోల్ పోసి నిప్పు పెట్టేసాడు..చివరికి ఏమైందంటే.?

248

రోజురోజుకి దేశంలో దారుణ సంఘటనలు ఎక్కువవుతున్నాయి.ముఖ్యంగా అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్నాయి.అక్రమ సంబంధాల మోజులో పడి కాపురాలను నాశనం చేసుకుంటున్నారు.ఈ అక్రమ సంబంధం మత్తులో కట్టుకున్నవాళ్ళని మోసం చేస్తున్నారు.కొంత మంది ఆడవాళ్ళు అయితే కట్టుకున్న భర్తను చంపేస్తున్నారు. చివరికి పుట్టిన బిడ్డలు కూడా అడ్డువస్తున్నారని వారి అడ్డు తొలగించుకునే వారు ఉన్నారు.కొందరు అయితే వావివరసలు మరచి మరి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.కొంతమంది అయితే అమ్మ వరుస కావాల్సిన వాళ్ళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు.ఇప్పుడు చెప్పే స్టొరీ అలాంటిదే.మరి ఆ అక్రమ సంబంధ కథ చివరికి ఏమైందో తెలుసుకుందామా.

కాకినాడ కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల రావుల మల్లేశ్వరికి స్థానిక చొల్లంగికి చెందిన అప్పారావుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధల కారణంగా భర్తకు దూరమైన మల్లేశ్వరి తన మూడేళ్ళ కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటోంది. అయితే మల్లీశ్వరి ఫంక్షన్లలో వంట సామగ్రి శుభ్రపరిచే పనులకు వెళుతూ జీవనం సాగించేంది.ఈ క్రమంలో వంట సామగ్రిని తరలించే ఆటో డ్రైవర్‌ కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేట చినమార్కెట్‌ వీధికి చెందిన బొడ్డు గంగాద్రి అలియాస్‌ బాబీతో మల్లీశ్వరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా వారిద్దరి మధ్య సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ గత ఆరు నెలలుగా కాకినాడ రూరల్‌ మండలం సర్పవరంలోని పూలమార్కెట్‌ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.అయితే, గత వారం రోజులుగా తన వద్దకు బాబీ రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులే తన ప్రియుడిని రానీయకుండా ఆపి ఉంటారని భావించింది. ఈ నేపథ్యంలో మల్లీశ్వరి సోమవారం తన తల్లి కుమారిని తీసుకుని రామారావుపేటలోని బాబి ఇంటికి వెళ్లింది. అక్కడ బాబి కనిపించకపోయేసరికి బాబిని తనతో పంపాలంటూ అతని తల్లిదండ్రులైన అమ్మాజీ, కామేశ్వరరావులను కోరింది.

పెళ్లి కావాల్సిన కుర్రాడిని నీతో పంపేందుకు ససేమిరా కుదరదని బాబి తల్లిదండ్రులు ఖరాఖండిగా మల్లీశ్వరితో చెప్పారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం బాబి తల్లిదండ్రులు కోపోద్రిక్తులై సమీపంలో బాటిల్‌లో ఉన్న పెట్రోల్‌ను మలీశ్వరిపై పోసి నిప్పంటించారు.ఫలితంగా ఆమె దేహం కాలిపోతూ బాధితురాలు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తూ కుప్పకూలిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మల్లీశ్వరిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.చూశారుగా అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతని కోసం ఇంటికి వెళ్ళిన ఆమె గతి ఏమైందో.కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా అందరి జీవితాలు బాగుంటాయి.