Breaking News..రాబోయే వరదల వల్ల 16 వేల మందికి పైగా చనిపోతారట!

458

కేరళలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అక్కడి ప్రజలు కోలుకోడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.భారీ వర్షాలతో రాష్టం అస్తవ్యస్తం అయ్యింది.లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.నిలవడానికి నీడ లేక అతి దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఇంతక ముందు ప్రకృతికి అందం కేరళ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ప్రకృతి విలయతాండవం చేసి అక్కడి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముకం పట్టాయి.అయితే ఈ వరదలు ఇక్కడితోనే ఆగిపోవు అని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంది. రాబోయే కాలంలో ఇంకా చాలా వరదలు వస్తున్నాయని చెప్తున్నారు.మరి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఏమేమి చెప్పిందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for kerala flood

రాబోయే పదేళ్లలో దేశవ్యాప్తంగా వరదల వల్ల జరిగే ప్రాణ, ఆస్తి నష్టం గురించి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసి ఓ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా వచ్చే పదేళ్లలో వరదలు, తుపాన్లు వల్ల 16,000ల మందికి పైగా ప్రాణాలు కోల్పోతారని, రూ.47,000 కోట్లు మేర ఆస్తి నష్టం సంభవిస్తుందని తెలియజేసింది. అత్యంత అధునాత ఉపగ్రహాలు, హెచ్చరిక వ్యవస్థల సాయంతో రాబోయే విపత్తు గురించి ముందస్తు అంచనా వేసి ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ప్ర‌కృతి వైపరిత్యాలు, వరదల లాంటి అత్యవసర సమయంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అవసరమైన మార్గనిర్దేశకాలు విడుదల చేసి సభలు, సమావేశాలతో ప్రజలను అప్రమత్తం చేస్తుంది. మరోవైపు కేరళ విలయంపై ఎన్డీఎంఏ తీసుకుంటున్న చర్యలపై స్పందించడానికి ఆ సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు.

Image result for kerala flood INJURED PEOPLE

కేంద్ర హోం శాఖ దేశంలోని 640 జిల్లాల్లో విపత్తు ప్రమాద అంచనా పేరుతో ఓ సర్వే నిర్వహించింది. నేషనల్ రెసీలియన్ ఇండెక్స్ పేరుతో రూపొందించిన ఈ నివేదికలో ప్రమాదం అంచనా, నివారణ, ఉపశమనం, పునరావాసం లాంటి చర్యలపై పనితీరు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకులను కేటాయించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన నివారణ చర్యల స్థాయి చాలా తక్కువగా ఉందని, ఈ అంశంలో గణనీయమైన మెరుగుదల అవసరమని ఈ అధ్యయనం వెల్లడించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతేకాదు చాలా రాష్ట్రాలు ఇందుకోసం స్పష్టమైన విధానాలు అనుసరించడం లేదని నివేదిక ద్వారా తెలియజేసింది.ఒక్క హిమాచల్‌ప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో విపత్తు ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక వసతులు లేవని స్పష్టం చేసింది. దశాబ్దం కిందట సమగ్ర విపత్తు ప్రమాద నిర్వహణ విధానం కలిగి ఉన్న గుజరాత్, ప్రస్తుతం మాత్రం అది ప్రజాపయోగానికి అందుబాటులో లేదని నివేదిక తేల్చి చెప్పింది.కాబట్టి మిగతా రాష్టాలు కూడా ముందు చర్యలో బాగంగా జాగ్రతగా ఉండాలని సూచిస్తుంది.ఇదేనండి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలు.మరి కేరళలో జరుగుతున్న వరద భీభత్సం గురించి అలాగే రాబోయే కాలంలో వచ్చే వరదల గురించి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఇచ్చిన నివేదిక గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.