విషాదం : కన్న తల్లి చూస్తుండగా 12 రోజుల బాబుని కోతి ఎత్తుకెళ్ళి..ఏం చేసిందో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

431

మనం ఈ మధ్య కాలంలో కోతులను చూడటం తగ్గిపోయింది.ఎందుకంటే పల్లెటూరు లలో అడవులలో తప్ప కోతులు ఇంకా ఎక్కడ లేవు.సిటీలలో అయితే ఒక్క కోతి కూడా కనిపించదు.అయితే కోతులు చేసే పనులు మాత్రం మన అందరికి తెలిసిందే.మనం ఏదైనా తుంటరి పని చేస్తే కోతిలాగా చేసాం అని అంటారు.ఎందుకంటే కోతులు చేసే పనులు ఆలా ఉంటాయి కాబట్టి.కొన్నిసార్లు కోతులు చెడ్డ పనులు కూడా చేస్తాయి.కోతుల వలన మనుషులకు హాని కూడా జరుగుతుంది.ఇప్పుడు ఒక కోతి చేసిన పని వలన ఒక కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.మరి ఆ కోతి ఏం చేసిందో పూర్తీగా తెలుసుకుందామా.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో కొద్ది రోజులుగా కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు అంటున్నారు.ఆ కోతులు ఆగ్రాలోని ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతుంది.రోడ్ల మీద వెళ్లేవారి మీదకు వెళ్లి దాడి చేస్తున్నాయి.వాటిని అడవులకు తరలించాలని చాలా మంది ప్రజలు కలిసి అధికారులకు పిర్యాదు చేశారు.అయినా కానీ ఈ విషయం పై అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టీనుచోవడం లేదు.. దీంతో అధికారులకు ప్రజలకు మధ్య చాలాసార్లు గొడవ కూడా అయ్యింది.ఈ గొడవ ఇలా ఉండగానే తాజాగా ఆగ్రాలో జరగరాని ఘోరం జరిగిపోయింది. 12 రోజుల పసివాడిపై వానరం దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ప్రాణాలు విడిచాడు.

ఆగ్రాకు చెందిన యోగేష్, నేహా భార్యాభర్తలు. ఆటో డ్రైవరైన యోగేష్ సోమవారం బయటకు వెళ్లాడు.. నేహా తన 12 రోజుల పసిబిడ్డతో ఇంట్లోనే ఉంది. అయితే సాయంత్రం తల్లి పసివాడికి పాలిస్తున్న సమయంలో ఓ కోతి ఇంట్లోకి ప్రవేశించింది.కోతిని చూసి పిల్లాడిని పక్కనే ఉన్న మంచం మీద పడుకోబెట్టింది. ఒక్కసారిగా నేహాపైకి దూకి దాడి చేసింది. దీంతో షాక్ తిన్న ఆమె కోతిని తరిమే ప్రయత్నం చేసింది.నేహా అలా చేసేసరికి కోతికి కోపం వచ్చినట్టుంది.వెంటనే ఆ వానరం ఒక్కసారిగా దూకి మంచంపై ఉన్న పసికందు మెడను పట్టుకొని ఈడ్చుకెళ్లింది. వెంటనే నేహా పెద్దగా కేకలు వేస్తూ స్థానికుల్ని పిలిచింది. అందరూ కలిసి వానరం వెంటపడి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ కోతి పిల్లాడిని పట్టుకుని ఇళ్ల డాబాలా మీద పరుగెత్తింది.కొద్దిసేపటి తర్వాత కోతి బాలుడిని పక్కింటిపై వదిలేసి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన పసివాడినికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.చూశారుగా ఈ కోతి ఎంతటి పని చేసిందో.కాబట్టి కోతులు మీ చుట్టుపక్కల ఉంటె జాగ్రత్తగా ఉండండి.మరి ఈ ఘటన గురించి మీరేమంటారు.