స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పై పోలీసు కేసు నమోదు..షాక్ లో సినీ ఇండస్ట్రీ ఏం చేసాడో తెలిస్తే ఛీ కొడతారు

267

ఇప్పుడు ప్రేమ‌లు కామ‌న్ అయ్యాయి.. ప్రేమించిన త‌ర్వాత వారు త‌మ‌తో స‌ఖ్యత‌గా ఉండ‌క‌పోతే వారితో బ్రేక్ అప్ కూడా అలాగే చెబుతున్నారు. ఇక వారి జీవితం వారిది అనుకుంటున్నారు… వేరే వారితో వివాహం నిశ్చ‌యం చేసుకుని కొంద‌రు పెళ్లి చేసుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం ఆ ప్రేమించిన వారే మ‌న‌కు కావాలి అని ప‌ట్టుబ‌ట్టీ మ‌రీ వారినే పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఇలా గ‌తంలో ప్రేమించినందుకు ఆ ప్రేమికుడు చేసిన‌దారుణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు మ‌రి ఆ విష‌యం ఏమిటో తెలుసుకుందాం.

ప్రేమించి మోసం చేయడంతో పాటు మరొక యువకుడితో కుదర్చుకున్న వివాహం రద్దు కావడానికి కారణమైనందుకు ఓ యువతి ఫిర్యాదు మేరకు జ్ఞానభారతి పోలీసులు సంగీత దర్శకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు. గూళిహట్టి చిత్రానికి సంగీత దర్శకుడిగా పని చేసిన మహదేవ్‌ కరణ్‌ రెండేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చెందిన ఓ యువతి పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే యువతి ఇంట్లో ఇరువురి ప్రేమను వ్యతిరేకించడంతో అప్పటి నుంచి యువతి మహదేవ్‌కు దూరంగా ఉండసాగింది.

దీంతోపాటు కొద్ది రోజుల క్రితం యువతికి మరొక యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మహదేవ్‌ యువకుడికి ఫోన్‌ చేసి యువతితో సాగించిన ప్రేమాయణాన్ని వివరించాడు. దీంతో యువకుడు యువతితో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నాడు. దీనంతటికి సంగీత దర్శకుడు మహదేవ్‌ కారణమని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు యువతితో జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేయించడంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు మహదేవ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసుకున్నారు.అయితే తాను ఇప్పుడు ప్రేమించ‌డం లేదు కాని త‌న‌కు నిశ్చితార్ధం అయిన యువ‌కుడికి ఫోన్ చేసి త‌న గురించి త‌ప్పుగా తెలియ‌చేశాడు అని అందుకే ఈ వివాహం ర‌ద్దు చేసుకున్నారు అని ఆమె క‌న్నీరు పెట్టుకున్నారు మ‌రో ప‌క్క పోలీసులు కూడా అత‌న్నీ అదుపులోకి తీసుకున్నారు